తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సేమియాతో ఉప్మా, పాయసమే కాదు - ఇలా "లడ్డూలు" ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అదుర్స్! - SEMIYA LADDU RECIPE

నిమిషాల్లో చేసుకునే సూపర్ స్వీట్ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

How to Make Semiya Laddu
Semiya Laddu Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 5:21 PM IST

Semiya Laddu Recipe in Telugu : సేమియా అనగానే మనలో ఎక్కువ మందికి ముందుగా గుర్తొచ్చేది పాయసం. లేదంటే సేమియా ఉప్మా, పులిహోర వంటివి మాత్రమే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటాం. అయితే, అవి మాత్రమే కాదు సేమియాతో సింపుల్​గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ స్వీట్ రెసిపీ ఉంది. అదే.. "సేమియా లడ్డూలు". పైగా ఇందుకోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్​తో తక్కువ సమయంలో ఈ లడ్డూలను చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్​గా ఉంటాయి! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ క్రంచీ లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేసుకోవాలి? అనే వివరాలు ఇఫ్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సేమియా - 1 కప్పు
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • జీడిపప్పు పలుకులు - కొన్ని
  • బెల్లం - పావు కప్పు
  • వాటర్ - తగినన్ని

సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యివేసుకోవాలి. అది కరిగాక సేమియా వేసుకొని మంటను లో టూ మీడియం ఫ్లేమ్​కి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్​లోకి మారేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకునేటప్పుడే అందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని మిశ్రమం బాగా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సేమియాచక్కగా వేగకపోతే లడ్డూలు పంటికి అతుక్కుంటూ తినడానికి మంచిగా అనిపించవు.
  • ఆవిధంగా సేమియా, జీడిపప్పులను వేయించుకున్నాక వాటిని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో బెల్లం, ఒక టేబుల్​స్పూన్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • అయితే, పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు ఎలా తెలుసుకోవాలంటే.. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పాకాన్ని వేసుకోవాలి. అప్పుడు దాన్ని నీటిలో నుంచి తీస్తే ముద్దలా ముదురు పాకం రావాలి. ఎలా టర్న్ చేస్తే అలా టర్న్ అవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లని గుర్తుంచుకోవాలి.
  • ఇలా పాకాన్ని సిద్ధం చేసుకున్నాక మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ముందుగా వేయించిన పక్కన పెట్టుకున్న సేమియా, జీడిపప్పుల మిశ్రమాన్ని అందులో వేసుకొని మొత్తం కలిసేలా గరిటెతో కలుపుతూ చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. అయితే, మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారితే మిశ్రమం డ్రైగా మారుతుంది.
  • ఒకవేళ లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతులకు బాగా వేడి తగులుందనిపిస్తే మధ్యమధ్యలో హ్యాండ్స్​కి వాటర్ అప్లై చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి.
  • అలా మొత్తం మిశ్రమాన్ని లడ్డూల చుట్టుకొని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "సేమియా లడ్డూలు" రెడీ!

"సీతాఫల్​ సేమియా పాయసం" - రుచి అమృతాన్ని మించి - ఒక్కసారి టేస్ట్​ చేస్తే జిందగీ ఖుష్!

ABOUT THE AUTHOR

...view details