Rava Laddu Recipe in Telugu : సరదాల సంక్రాంతికి తెలుగు లోగిళ్లన్నీ రకరకాల పిండి వంటలతో ఘుమఘుమలాడుతాయి. అరిసెలు, సకినాలు, గారెలు ఇలా ఎన్నో రెసిపీలు నోరూరిస్తాయి. ఈ క్రమంలోనే చాలా మంది రవ్వ లడ్డూలను ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, కొందరికి ఎన్ని సార్లు చేసినా పర్ఫెక్ట్గా కుదరవు. అలాంటి వారు సంక్రాంతివేళ ఈ ప్రాసెస్‌లో "రవ్వ లడ్డూలు" ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదరడమే కాకుండా సూపర్ టేస్టీగా ఉంటాయి. అంతేకాదు, ఇవి కనీసం రోజుల పాటు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి! పైగా వీటిని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- నెయ్యి - పావు కప్పు
- జీడిపప్పు, కిస్మిస్ - పావు కప్పు
- బొంబాయి రవ్వ - 2 కప్పులు
- పచ్చి కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు
- యాలకుల పొడి - 1 టీస్పూన్
పాకం కోసం :
- పంచదార - పావు తక్కువ రెండు కప్పులు
- వాటర్ - అర కప్పు
సంక్రాంతి స్పెషల్ : సూపర్ టేస్టీ "కొబ్బరి బూరెలు" - అరిసెలు రానివారు ఈజీగా చేసేయొచ్చు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యివేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ను వేసుకొని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్లోకి మారి, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందుకోసం 10 నుంచి 15 నిమిషాల టైమ్ పట్టొచ్చు.
- మీరు రవ్వను ఎంత బాగా వేయించుకుంటే లడ్డూ రుచి అంత బాగుంటుందని గుర్తుంచుకోవాలి.
- ఆవిధంగా రవ్వను వేయించుకున్నాక అందులో రవ్వను తీసుకున్న కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు పచ్చికొబ్బరి తురుముని వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై సన్నని సెగ మీద మరో 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
- అలా వేయించుకునేటప్పుడు అవసరమైతే ఒకటి నుంచి రెండు టేబుల్స్పూన్ల వరకు నెయ్యిని అదనంగా వేసుకొని నిదానంగా గరిటెతో కలుపుతూ చక్కగా వేయించుకోవాలి.
- దోరగా, కమ్మని వాసన వచ్చేంత వరకు రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేయించుకున్నాక దింపే ముందు యాలకుల పొడి వేసి మొత్తం కలిసేలా చక్కగా మిక్స్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని వేయించుకున్న డ్రైఫ్రూట్స్ఉన్న మిక్సింగ్ బౌల్లో వేసుకొని మరోసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకొని పక్కనుంచాలి.
పొంగల్ స్పెషల్ : క్రిస్పీ అండ్ టేస్టీ "రిబ్బన్ పకోడా, చెక్కలు, కొబ్బరి మురుకులు" - చేసుకోండిలా!
- ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై అదే కడాయి పెట్టుకొని పంచదార, అర కప్పు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కెర కరిగేంత వరకు మరిగించుకోవాలి.
- పంచదార కరిగి లేత తీగ పాకం వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకొని గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్ మీద మరో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అంటే మిశ్రమం కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని దింపి చేతితో పట్టుకోవడానికి వీలుగా కొద్దిగా చల్లార్చుకోవాలి.
- ఆ తర్వాత మిశ్రమాన్ని చేతితో మాష్ చేసుకుంటూ కొద్దికొద్దిగా తీసుకొని లడ్డూల మాదిరిగా చుట్టుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా కమ్మని నోరూరించే "రవ్వ లడ్డూలు" రెడీ!
- అనంతరం ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం నెల రోజుల పాటు గట్టిగా పడకుండా తాజాగా నిల్వ ఉంటాయి!
నోరూరించే "కొబ్బరి హల్వా" - ఈ పద్ధతుల్లో చేస్తే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది!