Telangana Sankranti Special Recipes : తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సరదాల సంక్రాంతి వచ్చేస్తోంది. ఈ పండక్కి వారం ముందు నుంచే తెలుగు లోగిళ్లలో పిండి వంటల హడావిడి స్టార్ట్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ స్పెషల్ పిండి వంటకమైన సకినాలను తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంటారు మహిళలు. అలాగే, కొందరు బియ్యప్పిండితో మురుకులు చేసుకోవాలనుకుంటారు. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. కానీ, చాలా మందికి అవి అంత పర్ఫెక్ట్గా కుదరవు. అలాంటి వారు ఈ సంక్రాంతికిఇలా ట్రై చేయండి. కరకరలాడుతూ టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సకినాలు :
కావాల్సిన పదార్థాలు :
- 8 కప్పులు - బియ్యం
- 1 కప్పు - నువ్వులు
- 6 చెంచాలు - వాము
- తగినంత - ఉప్పు
- వేయించడానికి సరిపడా - ఆయిల్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత నీళ్లు వడకట్టి ఒక శుభ్రమైన క్లాత్ మీద పలుచగా పరచి కనీసం 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. నీరంతా పోయి కాస్త తడిగా ఉన్నప్పుడు గిర్నీకి తీసుకెళ్లి పిండి పట్టించి తెచ్చుకోవాలి.
- ఆ తర్వాత పట్టించుకున్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్(బేషన్)లో జల్లించుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. ఆపై వాటిని జల్లించుకున్న పిండిలో వేసుకోవాలి. అలాగే వాము, తగినంత ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మురుకులపిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ కాటన్ క్లాత్‌ను తడిపి పలుచగా పరచి కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకుని వేళ్లతో పొడువుగా తిప్పుతూ మూడు లేదా నాలుగు చుట్లుగా చుట్టాలి. ఆవిధంగా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. తర్వాత వాటిని కాసేపు ఆరనివ్వాలి.
- ఆలోపు స్టౌపై కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత సకినాలను వేసుకొని దోరగా కాలనిచ్చి తీసేయాలి.
- చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "తెలంగాణ స్పెషల్ సకినాలు" రెడీ!
- అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో సన్నని తాడుగా వలయాకారంగా చేయడానికి నైపుణ్యం ఉండాలి.
- కాబట్టి, ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే జంతికల గొట్టంలో స్టార్ గుర్తు ఉన్న బిళ్లను వేసి లోపల కొద్దిగా ఆయిల్ రాసి పిండి ముద్దను ఉంచి సకినాల షేప్‌లో ఒత్తుకున్నా సరిపోతుంది.
ఈ చిన్న టిప్స్ ఫాలో అవుతూ "అరిసెలు" చేసుకోండి - పర్ఫెక్ట్ టేస్ట్‌తో పొంగుతూ, సాఫ్ట్‌గా వస్తాయి!