తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్​ టేస్టీ "సగ్గుబియ్యం పకోడి" - ఇలా చేస్తే యమ్మీ యమ్మీగా ఉంటాయి!

-ఎప్పుడూ ఆనియన్​, పాలకూర పకోడి ఏం బాగుంటుంది - ఈ సారి వెరైటీగా సగ్గుబియ్యంతో చేయండి

How to Make Sabudana Pakodi at Home
How to Make Sabudana Pakodi at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

How to Make Sabudana Pakodi at Home : పకోడి.. ఈ రెసిపీకి ఫ్యాన్​ బేస్​ ఓ రేంజ్​లో ఉంటుంది. తినాలనిపించినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కవ మంది దీనికే ప్రిఫరెన్స్​ ఇస్తారు. ఎందుకంటే నిమిషాల్లో తయారవ్వడమే కాదు.. టేస్ట్​ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే.. పకోడి అంటే చాలా మంది ఉల్లిపాయ, పాలకూర, పల్లీ పకోడి అంటూ రకరకాలుగా చేసుకుంటుంటారు. కానీ.. వీటితో మాత్రమే కాకుండా సగ్గుబియ్యంతో కూడా అద్దిరిపోయే పకోడి చేసుకోవచ్చు. దీని టేస్ట్​ కూడా ఆనియన్​ పకోడికి ఏమాత్రం తీసిపోదు. దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సగ్గుబియ్యం పకోడి రెసిపీకి కావలసిన పదార్థాలు :

  • సగ్గుబియ్యం - అరకప్పు
  • బంగాళదుంపలు - రెండు
  • వేరుశనగ పలుకులు - పావు కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు
  • జీలకర్ర - అర స్పూను
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • సగ్గుబియ్యం పకోడి చేయడానికి ముందుగా సగ్గుబియ్యాన్ని నానపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి.. సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. అలాగే వేరుశనగ పల్లీలను దోరగా వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​లోకి ఉడికించిన బంగాళదుంపల మిశ్రమం, సగ్గుబియ్యం పొడి, వేరుశనగ పలుకులు వేసి కలపాలి.
  • ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి పకోడి పిండి మాదిరి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోయండి.
  • నూనె కాగిన తర్వాత సగ్గుబియ్యం, ఆలుగడ్డ మిశ్రమాన్ని మరోసారి కలిపి పకోడిల మాదిరి నూనెలో వేయాలి.
  • ఫ్లేమ్​ను మీడియంలో పెట్టి అవి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం పకోడిలు రెడీ.
  • నచ్చితే మీరూ ట్రై చేయండి. వీటికి గ్రీన్​ చట్నీ కాంబినేషన్​ మరో లెవల్ లో​ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details