తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రెస్టారెంట్ స్టైల్ "రుమాలి రోటీ" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - చాలా రుచికరంగానూ ఉంటాయి! - RUMALI ROTI RECIPE

రుమాలి రోటీ కోసం హోటల్, రెస్టారెంట్స్​కి వెళ్లాల్సిన పనిలేదు! - నిమిషాల్లో ఇంట్లోనే చేసుకోండిలా!

RESTAURANT STYLE RUMALI ROTI
Rumali Roti Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 8:22 PM IST

How to Make Rumali Roti Easily at Home : చాలా మంది రుమాలి రోటీని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లినప్పుడు వీటిని తప్పక టేస్ట్ చేస్తుంటారు. అలాగే.. కొంతమంది రెస్టారెంట్స్​కి వెళ్లినప్పుడు పన్నీరు, ఏదైనా నాన్​వెజ్​ కర్రీతో రుమాలి రోటీని ఆర్డర్ చేసి ఆస్వాదిస్తుంటారు. ఇంకొందరు ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటుంటారు. కానీ.. మీకు తెలుసా? ఇంట్లో కూడా ఈజీగా "రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటీ"ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగానూ ఉంటాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇప్పుడే ఇలా ప్రిపేర్ చేసుకోండి.

కావాల్సిన పదార్థాలు :

  • మైదా పిండి - 1 కప్పు
  • ఉప్పు - సరిపడా
  • పంచదార - అర చెంచా
  • నూనె - తగినంత

తయారీ విధానం :

  • ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మొదటగా ఒక చిన్న బౌల్​లో అర చెంచా చొప్పున చక్కెర, ఉప్పుతో పాటు తగినన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి.
  • ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్​లో మైదా తీసుకొని కరిగించుకున్న ఉప్పు వాటర్ పోసుకొని చేతివేళ్లతో పిండి మొత్తం తడిసేలా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని జిగురుగా, సాఫ్ట్​గా ఉండేలా కలుపుకోవాలి. అలా పిండిని రెడీ చేసుకున్నాక.. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్వేసుకొని కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు వత్తుకోవాలి.
  • తర్వాత మరో టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మరికాసేపు పిండిని వత్తుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఎక్కువసేపు పిండిని వత్తుకోవడం వల్ల రోటీలు చేసుకునేటప్పుడు పిండి చాలా సాఫ్ట్​గా సాగుతుంది. పిండి అనేది చపాతీ పిండి కంటే కూడా చాలా చాలా సాఫ్ట్​గా ఉండే విధంగా కలుపుకోవాలి.
  • ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై ఒక ప్లేట్​ మీద కాస్త పొడిపిండిని చల్లుకొని పిండి ఉండలను ఉంచి వాటిపైన కొద్దిగా ఆయిల్​ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిపై తడి క్లాత్​ను కప్పి అరగంటపాటు అలా వదిలేయాలి.
  • ఇప్పుడు స్టౌ బర్నర్ మీద ఐరన్ కడాయిని బోర్లించి స్టౌను హై ఫ్లేమ్​లో పెట్టి వేడి చేసుకోవాలి. అది హీట్ అయ్యే లోపు ఒక చిన్న బౌల్​లో ఒక టేబుల్​ స్పూన్ ఉప్పు, అర కప్పు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి.
  • తర్వాత ఆ వాటర్​ను​ స్టౌపై హీట్ అవుతున్న బోర్లించిన కడాయిపై కొద్దిగా చల్లుకోవాలి. అంతే.. రుమాలి రోటీ కోసం పాన్ రెడీ!
  • ఇక ఇప్పుడు చపాతీపీట మీద పొడిపిండిని చల్లుకొని రోటీ కోసం తడిపిపెట్టుకున్న పిండి ఉండను ఉంచి ముందుగా చేతితో కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ రోలర్ సహాయంతో.. వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని ఒక చేతి నుంచి మరొక చేతిలోకి మార్చుకుంటూ పల్చని కర్చీఫ్​ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. అనంతరం దాన్ని స్టౌపై హీట్ అవుతున్న పెనంపై వేసుకొని 30 సెకన్లు కదపకుండా అలా వదిలేయాలి.
  • ఆ తర్వాత రోటీ సెపరేట్ అవుతుంది. అప్పుడు దాన్ని చేతితో మధ్యలోకి జరుపుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. చక్కగా కాలాక కర్చీఫ్​లా ఫోల్డ్ చేసుకొని ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. "రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటీ" రెడీ!

ABOUT THE AUTHOR

...view details