తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ప్లాస్టిక్​ బాక్సులపై మరకలు పోవడం లేదా ? ఇలా క్లీన్​ చేస్తే కొత్త వాటిలా మెరుస్తాయి! - Plastic Containers - PLASTIC CONTAINERS

Clean Plastic Containers : నేటి కాలంలో ఇంట్లోని కిచెన్​లో పోపు సామాగ్రి నుంచి, పప్పు, ఉప్పుల వరకు ప్రతి ఒక్కవాటిని స్టోర్​ చేసేందుకు ప్లాస్టిక్​ డబ్బాలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, చాలా రోజుల నుంచి వీటిని ఉపయోగిస్తుంటే.. వాటిపై మరకలు పడుతుంటాయి. ఈ మరకలను ఎలా మాయం చేయాలో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.

Plastic Containers
Clean Plastic Containers (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2024, 10:23 AM IST

Updated : Sep 12, 2024, 10:00 AM IST

Remove Stains From Plastic Containers :ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో పప్పులు, ఉప్పు, చింతపండు, కారం, పచ్చళ్లు వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను స్టోర్​ చేసేందుకు ప్లాస్టిక్​ డబ్బాలను ఎక్కువగా వాడుతున్నారు. అలాగే మరికొంతమంది లంచ్​ బాక్స్​లకు సైతం వీటినే వాడుతున్నారు. ఇలా ప్లాస్టిక్​ డబ్బాలు మన జీవితంలో ఒక భాగమై పోయాయి. అయితే, తరచూ ప్లాస్టిక్ బాక్సులను క్లీన్​ చేస్తున్నా.. చాలా రోజుల నుంచి వాడుతుంటే వాటిపై మరకలు ఏర్పడుతుంటాయి. ఇవి ఎంత క్లీన్​ చేసినా కూడా తొలగిపోవు. అయితే, ప్లాస్టిక్​ డబ్బాలపైన ఉన్న మరకలను మాయం చేయడానికి కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెనిగర్​ :
ఒక వంతు నీళ్లకు, రెండు వంతుల వెనిగర్‌ కలపండి. ఈ మిశ్రమంలో మృదువైన స్క్రబ్బర్‌ ముంచి ప్లాస్టిక్​ డబ్బాలను క్లీన్​ చేయండి. ఇలా చేస్తే డబ్బాలపైన ఉన్న మరకలు తొలగిపోయి.. కొత్తవాటిలా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

హ్యాండ్ శానిటైజర్ :
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో హ్యాండ్​ శానిటైజర్​ ఉంటుంది. బయట నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత అలాగే, వివిధ రకాల ఇన్ఫెక్షన్​లు రాకుండా ఉండడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే, హ్యాండ్​ శానిటైజర్​ని ఉపయోగించడం ద్వారా ఈజీగా ప్లాస్టిక్​ డబ్బాలపైన ఉన్న మరకలను తొలగించవచ్చు. అది ఎలా అంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా హ్యాండ్​ శానిటైజర్​ కలిపి ప్లాస్టిక్​ బాక్స్​లను అందులో గంటసేపు ఉంచాలి. తర్వాత సోప్​తో రుద్ది క్లీన్​ చేస్తే సరిపోతుంది. మరకలు మొత్తం మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మరసం, బేకింగ్ సోడా :
ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా, నిమ్మకాయ తప్పకుండా ఉంటాయి. అయితే, వీటిని ఉపయోగించి ప్లాస్టిక్​ డబ్బాలపైన ఉన్న మరకలను ఈజీగా మాయం చేయవచ్చు. అది ఎలా అంటే ఒక గిన్నెలో బేకింగ్​ సోడా, నిమ్మరసం కలిపి.. మృదువైన స్క్రబ్బర్‌ సహాయంతో ఆ మిశ్రమాన్ని ప్లాస్టిక్​ డబ్బాలపైన రుద్దాలి. ఇలా చేసిన తర్వాత నీటితో క్లీన్​ చేస్తే అవి కొత్త వాటిలా మెరుస్తాయి. ఇక్కడ మీరు బేకింగ్​ సోడాకి బదులుగా ఉప్పుని కూడా ఉపయోగించవచ్చు. 2019లో 'జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ హెల్త్​'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బేకింగ్​ సోడా, నిమ్మరసం మిశ్రమం ప్లాస్టిక్​ డబ్బాలపైన ఉన్న పసుపు మరకలను తొలగించడానికి బాగా పనిచేసిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీకి చెందిన 'డాక్టర్​ ప్రమోద్ కుమార్ సింగ్​' పాల్గొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

ఇవి కూడా చదవండి :

ప్లాస్టిక్​ బాక్సులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్​ పాటించి క్లీన్​ చేస్తే బ్యాడ్​ స్మెల్​ పరార్​!

వామ్మో - గ్యాస్​ స్టవ్​ పక్కన నూనె డబ్బా పెడితే ఇంత డేంజరా? ఎందుకో తెలుసుకోండి!

Last Updated : Sep 12, 2024, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details