Best Remedy To Reduce Excess Water in The Body : మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగిన శారీర శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, నిలబడడం వల్ల బాడీ చుట్టూ ద్రవాలు సరిగా ప్రసరించడం ఆగిపోతాయి. దాంతో శరీర కణజాలం చుట్టూ నీటి శాతం పేరుకుపోతుంది. ఫలితంగాబరువు(Weight)పెరిగిపోతుంటారు. మీరూ ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? అయితే, మీకోసం ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ దివ్యౌషధం తీసుకొచ్చాం. దాన్ని మజ్జిగతో ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నారంటే చాలు.. శరీరంలో పేరుకుపోయిన అధిక నీరు ఇట్టే తగ్గిపోతుందంటున్నారు ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ డాక్టర్ గాయత్రీ దేవీ. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- మజ్జిగ - 600 మిల్లీ లీటర్లు
- వాము పొడి - 15 గ్రాములు
- ఉసిరి చూర్ణం - 15 గ్రాములు
- కరక్కాయ చూర్ణం - 15 గ్రాములు
- సైందవ లవణం - సుమారు 7 నుంచి 8 గ్రాములు
- మిరియాల పొడి - 15 గ్రాములు
- సవర్శలవణం - సుమారు 7 నుంచి 8 గ్రాములు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన పల్చటి మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి. అంటే.. పెరుగుని ఒక భాగం తీసుకుంటే, మూడు భాగాల వాటర్ తీసుకొని బాగా చిలికి పల్చటి మజ్జిగను రెడీ చేసుకోవాలి.
- అదేవిధంగా వామును వేయించి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. కావాల్సిన పరిమాణంలో కరక్కాయను చూర్ణాన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి.
- వీటితో పాటు ఎండబెట్టిన ఉసిరికాయలను తీసుకొని కావాల్సిన మోతాదులో పొడిని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మిరియాల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్చటి మజ్జిగ తీసుకోవాలి. ఆపై అందులో వాము పొడి, కరక్కాయ చూర్ణం, ఉసిరి పొడి, మిరియాల పొడి.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
- ఆ తర్వాత అదే మిశ్రమంలో పైన తీసుకున్న వాటికంటే సగం పరిమాణంలో చూర్ణం చేసుకున్న సైందవ లవణం, సవర్శ లవణం వేసుకోవాలి. ఈ సవర్శ లవణం అనేది కూడా ఒక రకమైన ఉప్పు.
- ఇలా మజ్జిగలో అన్నింటినీ వేసుకున్నాక మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని మూతపెట్టి మూడు రోజుల పాటు పులియనివ్వాలి.
- ఇలా చేయడం ద్వారా మజ్జిగ బాగా పులుస్తుంది. అలాగే.. అందులో వేసుకున్న ద్రవ్యాలన్నీ మజ్జిగలో మంచిగా కలిసి ఒక చక్కటి పత్యాహారం లాంటి ఔషధం తయారవుతుందంటున్నారు డాక్టర్ గాయత్రీ దేవి.
దీన్ని ఎలా తీసుకోవాలంటే?