తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పచ్చి కొబ్బరితో అద్దిరిపోయే కారం పొడి - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి! - COCONUT CHILI POWDER

- అన్నంలోకి, టిఫెన్​లోకి సూపర్ కాంబినేషన్ - ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

Raw Coconut Chili Powder
Raw Coconut Chili Powder at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 11:51 AM IST

Raw Coconut Chili Powder at Home :కూరలు రోజూ తినేవాళ్లకు అప్పుడప్పుడూ కమ్మటి కారం పొడితే.. కాస్త నెయ్యి వేసుకుని తినాలనిపిస్తుంది. రుచిని ఆస్వాదించాలని మనసు కోరుకుంటుంది. అయితే.. ఏ కారం పొడి తినాలన్నది పాయింట్. చాలా రకాల పొడులు తయారు చేసుకోవచ్చు. వీటిల్లో దేనికదే ప్రత్యేకం. అన్నీ ఎంతో కమ్మగా ఉండేవే. అయితే.. ఇప్పుడు మాత్రం చాలా మందికి తెలియని పచ్చికొబ్బరి కారం పొడిరెసిపీని మీకు పరిచయం చేస్తున్నాం.

ఈ పొడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భోజన ప్రియులు ఇష్టంగా లాగించేయొచ్చు. అన్నంలోకి మాత్రమే కాకుండా.. ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫెన్​లలోకి కూడా ఈ పొడిని వాడుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా ఈపచ్చికొబ్బరి కారం పొడి ఎలా చేయాలి ? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చికొబ్బరి ముక్కలు-కప్పు
  • పచ్చిశనగపప్పు-2 టేబుల్​స్పూన్లు
  • మినప్పప్పు-టేబుల్​స్పూన్​
  • ధనియాలు-టేబుల్​స్పూన్​
  • నువ్వులు-టేబుల్​స్పూన్​
  • జీలకర్ర-టీస్పూన్​
  • ఆవాలు -టీస్పూన్
  • మెంతులు-టీస్పూన్
  • ఎండుమిర్చి-10
  • నూనె సరిపడా
  • ఉప్పు రుచికి సరిపడా
  • కరివేపాకు-2
  • చింతపండు-ఉసిరికాయ సైజంత

తాలింపు కోసం..

  • ఆవాలు-అరటీస్పూన్​
  • జీలకర్ర-అరటీస్పూన్​
  • పచ్చిశనగపప్పు-కొద్దిగా
  • మినప్పప్పు-కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • కరివేపాకు
  • ఇంగువ -పావు టీస్పూన్​
  • పసుపు-చిటికెడు
  • తయారీ విధానం :
  • ముందుగా స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోండి.
  • పప్పులు వేగిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి. ఇందులో నువ్వులు, కొద్దిగా చింతపండు వేయండి.
  • ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
  • ఇప్పుడు పప్పులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని కాస్త బరకగా గ్రైండ్​ చేయండి.
  • ఆ తర్వాత ఇందులోనే పచ్చికొబ్బరి ముక్కలు వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో టేబుల్​స్పూన్​ ఆయిల్​ వేయండి.
  • నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి.
  • తాలింపు వేగిన తర్వాత ఇంగువ, పసుపు వేసి కలపండి. తర్వాత గ్రైండ్​ చేసుకున్న కారం పొడి వేసుకుని బాగా మిక్స్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో కమ్మని పచ్చి కొబ్బరి కారం పొడి మీ ముందుంటుంది. నచ్చితే ఈ విధంగా కారం పొడి ఓ సారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి:

ఎండు మిర్చితో కారం పొడి రొటీన్ - పచ్చి మిర్చితో ప్రిపేర్ చేసి చూడండి! - అద్దిరిపోయే రుచి మీ సొంతం

టిఫెన్ సెంటర్​ స్టైల్ "ఇడ్లీ కారం పొడి" - ఇలా తయారు చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details