తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఉప్మారవ్వతో నిమిషాల్లో చేసుకునే "రవ్వ పూరీలు" - ఒక్కసారి తిన్నారంటే టేస్ట్​కి ఎవరైనా ఫిదా!

ఎప్పడూ ఒకేరకమైన పూరీ ఏం బాగుంటుంది - ఓసారి ఇలా రవ్వతో ట్రై చేసి చూడండి!

HOW TO MAKE RAVA POORI
Rava Poori Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Rava Poori Recipe in Telugu : చాలా మంది బ్రేక్​ఫాస్ట్​ ఫెవరేట్ రెసిపీలలో ఒకటి.. పూరీ. కేవలం టిఫెన్​గా మాత్రమే కాకుండా పండగల సమయంలో, ఇతర సందర్భాల్లో, తినాలనిపించినప్పుడూ కొంతమంది వీటిని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, మనందరికీ సాధారణంగా పూరీలు అనగానే గోధుమపిండి, మైదాతో చేసినవే ముందుగా గుర్తొస్తాయి. అవి మాత్రమే కాదు.. ఉప్మారవ్వతో కూడా సూపర్ టేస్టీగా ఉండే పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు! ఇంతకీ, ఈ రవ్వ పూరీలకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఉప్మారవ్వ - పావుకిలో
  • బంగాళదుంపలు - 4
  • అల్లం పేస్టు - ముప్పావు చెంచా
  • పచ్చిమిర్చి ముద్ద - ముప్పావు చెంచా
  • గోధుమపిండి - కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • జీలకర్ర - చెంచా
  • వాము - అర చెంచా
  • నల్ల జీలకర్ర - చెంచా
  • కారం - చెంచా
  • నూనె - వేయించడానికి సరిపడా

నూనెలో వేయించకుండానే "మెత్తటి పూరీలు" - ప్రిపరేషన్ చాలా ఈజీ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో ఉప్మారవ్వను తీసుకొని అది మునిగే వరకూ నీళ్లు పోసి పావుగంట పాటు పక్కన ఉంచాలి.
  • ఆలోపు బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక వెడల్పాటి బౌల్​లోకి తీసుకొని మెత్తగా మాష్ చేసుకోవాలి.
  • పావుగంట తర్వాత నానబెట్టుకున్న ఉప్మారవ్వను ఒకసారి కలుపుకోవాలి. ఆపై అందులో ఒక చెంచా ఆయిల్, అల్లం పేస్టు, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, జీలకర్ర, వాము, నల్లజీలకర్ర, కారం, మాష్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్, కొత్తిమీర తరుగు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో గోధుమపిండిని యాడ్ చేసుకొని పూరీ పిండి మాదిరిగా కలుపుకొని ఓ అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కో ఉండను తీసుకుని కాస్త పొడిపిండిని అప్లై చేసుకుంటూ చపాతీరోలర్ సహాయంతో పూరీల్లా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న పూరీలను కాగుతున్న ఆయిల్​లో జాగ్రత్తగా వేసుకొని రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "రవ్వ పూరీలు" రెడీ!
  • వీటికి బంగాళదుంప లేదా టమాటా బఠాణీ కూర సూపర్‌ కాంబినేషన్‌. అలాగే, రవ్వ పూరీలలో అల్లం, మిర్చి వేయడం వల్ల కూర లేకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి వీటిని డైరెక్ట్​గా కూడా తినొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి!

ఇంట్లో చేసే పూరీలు పొంగట్లేదా? - ఇలా చేస్తే హోటల్​ స్టైల్లో చక్కగా వస్తాయి, ఇంకా సూపర్ టేస్టీ!

ABOUT THE AUTHOR

...view details