Raksha Bandhan Gifts 2024 :దేశవ్యాప్తంగా భాషా, బేధాలు లేకుండా జరుపుకునే అతి కొద్ది పండగల్లో ఒకటి.. రాఖీ పౌర్ణమి. సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రక్షాబంధన్(Raksha Bandhan 2024). ఈ పండగ వేళ అక్కాచెల్లెళ్లు.. తమ అన్నదమ్ములకు "ప్రేమ" అనే రాఖీని చేతికి కడతారు. ఆప్యాయతానురాగాల తీపిని తినిపించి.. "నువ్వు నాకు రక్ష - నేను నీకు రక్ష" అనే జీవితపు హామీని తీసుకుంటారు. ఈ సందర్భంగా తమ సోదరి సంతోషం కోసం సోదరులు బహుమతి ఇస్తుంటారు. మరి, ఈసారి మీ సోదరికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా క్లారిటీ లేకపోతే.. మీకోసమే "ఈటీవీ-భారత్" కొన్ని గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చింది. మరి, వాటిపై ఓ లుక్కేయండి.
స్మార్ట్ వాచ్ : మీరు మీ లవ్లీ చెల్లికి గాడ్జెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే.. స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వండి. అందులో హెల్త్ ట్రాకర్‌తో సహా అనేక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. వారు ఈ గిఫ్ట్‌ని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు మార్కెట్లో రకరకాల స్మార్ట్‌వాచ్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. లేదంటే మీ సోదరి ఫ్యూచర్‌కి ఉపయోగపడేలా ఏదైనా స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లాంటివి ఇచ్చి తనకు ఆనందాన్ని పంచండి.
మొక్కలు :మీ చెల్లి లేదా అక్క ప్రకృతి ప్రేమికురాలు అయితే... ఓ ఇండోర్ ప్లాంట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి. మీరు ఎలా అయితే సోదరికి తోడుగా, రక్షగా ఉంటారో.. మొక్కలు మనకు రక్షణగా ఉంటాయి. వాటిని ఇస్తే... పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది.
హ్యాండ్‌మేడ్ గ్రీటింగ్ కార్డ్ : చేతితో తయారు చేసిన ఈ గ్రీటింగ్ కార్డ్‌లో మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తీకరించే ఛాన్స్ ఉంది. కాబట్టి, రాఖీ సందర్భంగా ఈ గిఫ్ట్ ఇచ్చినా మీ సోదరి చాలా సంతోషిస్తారు.
ఫొటో ఫ్రేమ్ : ఈ రోజు మనం గడిపే క్షణాలు శాశ్వతం కాదు.. కానీ, వాటిని ఫొటో ద్వారా బంధించవచ్చు. ఎప్పటికీ ఆ మధుర క్షణాలను ఎదురుగా నిలుపుకోవచ్చు. అందుకే.. రక్షాబంధన్ వేళ ఈసారి అలాంటి గిఫ్ట్‌కి ప్లాన్ చేయండి. అందుకోసం.. చిన్నప్పుడు మీరిద్దరూ దిగిన ఫొటోలు ఉంటే.. అందులోంచి అద్భుతమైన దాన్ని ఎంచుకొని మంచి ఫొటో ఫ్రేమ్ రెడీ చేసి మీ సోదరికి ఇవ్వండి.