తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇడ్లీ పిండితో రుచికరమైన "పునుగులు" - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతాయి! - PUNUGULU WITH IDLI PINDI PROCESS

-రెగ్యులర్​గా ఇడ్లీలు తినాలనిపించడం లేదా? - ఇడ్లీ పిండితో ఇలా స్నాక్స్​ ప్రిపేర్​ చేసుకోండి

How to Make Punugulu with Idli Batter
How to Make Punugulu with Idli Batter (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 5:10 PM IST

How to Make Punugulu with Idli Batter:ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్​ఫాస్ట్​లలో ఇడ్లీ ఫస్ట్​ ప్లేస్​లో ఉంటుంది. అందుకే చాలా మంది రెగ్యులర్​గా వీటిని చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలోనే రెండు మూడు రోజులకు సరిపడే విధంగా పిండిని ప్రిపేర్​ చేసుకుని ఫ్రిడ్జ్​లో పెట్టుకుని వాడుతుంటారు. అయితే కొన్నిసార్లి ఇడ్లీలు తినాలిపించదు. దాంతో ప్రిపేర్​ చేసిన ఇడ్లీ పిండిని ఏం చేయాలో తెలియక పడేయడం చేస్తుంటారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేదు. ఇడ్లీ పిండి మిగిలిపోతే ఎంచక్కా పునుగులు వేసుకోవచ్చు. చలికాలంలో వేడివేడిగా క్రిస్పీగా ఏమైనా తినాలనుకునేవారికి ఇవి సూపర్​ ఆప్షన్​. వీటిని ప్రిపేర్​ చేయడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. మరి ఈ పునుగులకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఇడ్లీ పిండి - రెండు కప్పులు
  • ఉప్పు - రుచికి తగినంత
  • అటుకులు - 2 టేబుల్ స్పూన్స్
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ - 1
  • జీలకర్ర - అర టీస్పూన్
  • అల్లం - అంగుళం
  • బేకింగ్​ సోడా - చిటికెడు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా కట్​ చేసుకుని పక్కన పెట్టాలి. అలాగే అటుకులను ఓ గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి పావు గంట నానబెట్టాలి.
  • ఇప్పుడు ఓ గిన్నెలోకి ఇడ్లీ పిండి తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. మీరు అంతకుముందే ఇడ్లీ పిండిలో ఉప్పు వేసినట్లైతే చూసుకుని వేసుకోవాలి.
  • ఇడ్లీ పిండిలోకి నానబెట్టిన అటుకులను నీళ్లు లేకుండా పిండి వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్​ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు తరుగు, జీలకర్ర, బేకింగ్​ సోడా వేసి బాగా కలుపుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇడ్లీ పిండిని చిన్న చిన్న పునుగులుగా నూనెలో వేసుకోవాలి.
  • స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో పెట్టి రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఇడ్లీ పిండి మొత్తాన్ని పునుగులుగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి పునుగులు రెడీ.
  • వీటిని పల్లీ/టమాట/కొబ్బరి చట్నీతో తింటే అద్దిరిపోతాయి. నచ్చితే మీరూ ఇడ్లీ పిండి మిగిలినప్పుడు వీటిని ట్రై చేయండి.

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు "పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చడి" చేయండి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

ఎగ్, చికెన్​తో కాదు - ఓసారి ఇలా "మిల్లెట్ నూడుల్స్" చేయండి! - రుచితో పాటు ఆరోగ్యం బోనస్!

ABOUT THE AUTHOR

...view details