తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అమ్మవారికి ఎంతో ఇష్టమైన "పులిహోర పులుసు" - ఇలా చేసి నైవేద్యం సమర్పించండి! - Instant Pulihora Paste - INSTANT PULIHORA PASTE

దేవి నవరాత్రుల్లో ఆ దుర్గామాతకి సమర్పించే నైవేద్యాల్లో పులిహోర కూడా ఒకటి. అయితే, ఎంతో రుచికరంగా, చాలా ఈజీగా పులిహోర పులుసు ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Pulihora Pulusu
Pulihora Pulusu Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 9:56 AM IST

Pulihora Pulusu Recipe :దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అయితే, నవరాత్రుల సమయంలో ఎక్కువ మంది ఆ జగదాంబకు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ పులిహోరలో చింతపండు పులిహోర చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే, ఈ దేవి నవరాత్రుల్లో చాలా ఈజీగా టేస్టీగా చింతపండు పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా పులిహోర ప్రిపేర్​ చేసి పెట్టుకుంటే.. ఉదయాన్నే నైవేద్యంగా పులిహోర ఎంతో సులభంగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర పులుసు ఎలా చేయాలో మీరు చూడండి..

కావాల్సిన పదార్థాలు..

  • చింతపండు- 250 గ్రాములు
  • పసుపు- టీస్పూన్‌
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కరివేపాకు రెబ్బలు- 4
  • పచ్చిమిర్చి- 10
  • మిరియాలు -టీస్పూన్​
  • పసుపు-టీస్పూన్​
  • ఆయిల్​-కప్పు
  • నీళ్లు
  • బెల్లం-పావుకప్పు

పులిహోర పొడి కోసం..

మెంతులు- అర టీస్పూన్

ఆవాలు - అర టీస్పూన్

ధనియాలు-2 టేబుల్‌స్పూన్లు

జీలకర్ర- అరటీస్పూన్

నువ్వులు-టీస్పూన్

మిరియాలు -అరటీస్పూన్

ఎండుమిర్చి- 4

తాలింపు కోసం :

పల్లీలు-కప్పు

మినప్పప్పు-2 టేబుల్​స్పూన్లు

శనగపప్పు- 2 టేబుల్​స్పూన్లు

మిరియాలు-టీస్పూన్​

ఆవాలు-టీస్పూన్

ఎండుమిర్చి- 10

కరివేపాకు- రెండు రెబ్బలు

ఇంగువ - అరటీస్పూన్

తయారీ విధానం..

  • ముందుగా చింతపండుని అరగంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి.
  • తర్వాత స్టౌపై నానబెట్టుకున్న చింతపండు గిన్నె పెట్టుకుని కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేసుకుని చింతపండు రసం పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఈ చింతపండు రసం మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జల్లెడ గిన్నెలో వేసుకుని గుజ్జు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండు గుజ్జు ఈజీగా ఫిల్టర్​ కావడానికి మధ్యమధ్యలో కొన్ని నీళ్లను పోసుకుంటూ గరిటెతో ప్రెస్​ చేయాలి.
  • తర్వాత చింతపండు గుజ్జులో కరివేపాకులు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాలు, పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసి మరొసారి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని సన్నని మంట మీద చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి.
  • చింతపండు రసంలో ఆయిల్​ పైకి తేలిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఇప్పుడు పులిహోర పులుసు కోసం ఒక స్పెషల్​ పొడి సిద్ధం చేసుకుందాం. స్టౌపై పాన్​ పెట్టి మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పులిహోర పులుసులో ఈ పొడి వేయడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుంది.
  • ఇప్పుడు పాన్​లో కప్పు ఆయిల్​ వేసి పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మిరియాలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి ఫ్రై చేయండి.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసుకుని పులిహోర పులుసు పోసుకుని కలుపుకోవాలి. మీరు ముందుగా పులిహోర పులుసు సరిగా ఉడికించుకోకపోతే కొద్దిసేపు ఉడికించుకోండి. తర్వాత ప్రిపేర్​ చేసుకున్న పులిహోర పొడి కలుపుకోండి. అలాగే కొద్దిగా బెల్లం పొడి కలుపుకోండి.
  • అంతే ఇలా ప్రిపేర్​ చేసుకుంటే టేస్టీ పులిహోర పులుసు రెడీ. దీనితో మీరు ఈజీగా అప్పటికప్పుడు ఎప్పుడైనా ప్రసాదం పులిహోర తయారు చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా నవరాత్రులలో ఈ రెసిపీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

దేవీ శరన్నవరాత్రులు : అమ్మవారు మెచ్చే "శాఖాన్నం, లౌకీ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

శరన్నవరాత్రుల స్పెషల్ : పప్పులు నానబెట్టకుండా "ఇన్​స్టంట్ పూర్ణం బూరెలు" - ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి!

ABOUT THE AUTHOR

...view details