తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోట్లో వేస్తే కరిగిపోయే "స్పాంజ్ దోశ"- సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి- టేస్ట్ మామూలుగా ఉండదు! - Sponge Dosa Recipe - SPONGE DOSA RECIPE

Poha Dosa Recipe : చాలా మంది ఎక్కువగా ఇష్టపడే బ్రేక్​ఫాస్ట్ ఐటమ్స్​లలో ఒకటి.. దోశ. కానీ, ప్రతిసారీ క్రిస్పీ దోశలు తిని బోర్​గా అనిపిస్తోందా? అయితే, ఈసారి వెరైటీగా 'స్పాంజ్ దోశ'ను ట్రై చేయండి. పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఈ దోశ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది! మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Sponge Dosa Recipe
Poha Dosa Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Aug 30, 2024, 4:14 PM IST

How to Make Sponge Dosa Recipe in Telugu :మనందరికీ సాధారణంగా బ్రేక్​ఫాస్ట్ అంటే ఇడ్లీ, పూరీ, బోండా, వడ, దోశ.. వంటివి గుర్తుకొస్తాయి. వీటిల్లో దోశలకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. అయితే, ప్రతిసారీ క్రిస్పీ దోశలను(Dosa)తిని బోరింగ్​గా అనిపించొచ్చు. అందుకే ఈసారి మీకోసం ఒక సరికొత్త రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పోహా దోశ". దీనినే స్పాంజ్ దోశ అని కూడా అంటారు. ఈ రెసిపీ మహారాష్ట్ర, బెంగళూరులలో చాలా ఫేమస్. పైగా దీనికోసం ఎక్కువ పడాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్‌, ఐరన్‌ లాంటి పోషకాలు అందుతాయి. మరి, ఈ సూపర్‌ హెల్దీ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • రెండు కప్పులు - బియ్యం
  • అరకప్పు - పోహా
  • ఒక స్పూను - మెంతులు
  • రెండు కప్పులు - పెరుగు
  • రుచికి సరిపడా - నెయ్యి
  • రుచికి తగినంత - ఉప్పు

పోహా దోశ తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బియ్యం, మెంతులను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో వాటిని వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • అలాగే మరో బౌల్​లో అటుకులను కూడా బాగా కడిగి నానబెట్టుకోవాలి.
  • రెండు గంటల తర్వాత బియ్యం, మెంతుల మిశ్రమాన్ని వడకట్టి మిక్సీ జార్​లోకి వేసుకోవాలి. ఆపై కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిక్కటి పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆవిధంగా పట్టుకునేటప్పుడు మధ్యలో నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మరో బౌల్​లోకి తీసుకొని.. పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి దోశ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే, పిండి మరీ జారుడుగా కాకుండా కాస్త చిక్కగానే ఉండేట్లు చూసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మందపాటి దోశలా వేసుకోవాలి. ఎందుకంటే.. మరీ పలుచగా వేసుకుంటే క్రిస్పీలా వచ్చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • కాబట్టి.. అట్టు మాదిరిగా దోశ వేసుకున్నాక దానిపై కొద్దిగా నెయ్యిని చల్లుకొని మీడియం సైజు మంటపై రెండువైపులా కాల్చుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా, మెత్తగా మృదువుగా ఉండే "స్పాంజ్ దోశ" రెడీ!
  • ఈ దోశల్ని కొబ్బరి చట్నీ/పల్లీల చట్నీ, సాంబార్‌తో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఈ పోహా దోశను ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details