తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పల్లీ పాలకోవా" - ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మెచ్చే స్వీట్ రెసిపీ - సింపుల్​గా ప్రిపేర్ చేసేయండిలా!

PALLI PALaKOVA RECIPE
Peanut Burfi Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 7:14 PM IST

Peanut Burfi Recipe in Telugu : పిల్లల కోసం రోజూ ఏదో ఒకటి ప్రత్యేకంగా చేసి పెట్టాలనుకుంటారు చాలా మంది తల్లులు. అలాంటి వారికోసం ఒక సూపర్ స్వీట్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పల్లీ పాలకోవా". దీన్నే పీనట్ బర్ఫీ అని కూడా అంటారు. మామూలు పాలకోవా కంటే టేస్టీగా ఉండి తినాకొద్దీ తినాలపిస్తుంది ఈ స్వీట్! పైగా ఈ పాలకోవాలోశరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయట. మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - 1 కప్పు
  • పాలు - 1 కప్పు
  • కోకో పౌడర్/బూస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • పంచదార - అర కప్పు
  • నెయ్యి - కొద్దిగా
  • డ్రైఫ్రూట్స్ పలుకులు - కొన్ని(గార్నిష్ కోసం)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని పల్లీలను లో టూ మీడియం ఫ్లేమ్​ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆపై వాటిని చలార్చుకొని శుభ్రంగా పొట్టు మొత్తం తొలగించుకోవాలి.
  • ఆ తర్వాత ఆ పల్లీలను ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో 1 కప్పు వేడి వేడి పాలుపోసి కలిపి పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి.
  • ఆలోపు మరో చిన్న బౌల్​లో కోకో పౌడర్/బూస్ట్ తీసుకొని రెండు చెంచాల పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  • పావు గంట తర్వాత పాలలో నానబెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై అందులో పంచదార యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఒక నాన్​స్టిక్ పాన్ పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమాన్ని అందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి.
  • అప్పుడు ఆ మిశ్రమం బాగా దగ్గరకు అయి పాన్​ అంచుల వెంబడి కూడా సెపరేట్ అవుతుంది. అనంతరం దాన్ని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి.
  • అందులో ఒక భాగాన్ని నెయ్యి అప్లై చేసుకున్న ఒక గిన్నెలోకి తీసుకొని లేయర్ మాదిరిగా సమానంగా సర్దుకోవాలి.
  • అనంతరం పాన్​లో మిగిలిన మరో భాగం చక్కెర మిశ్రమంలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోపౌడర్ మిక్చర్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుతూ.. లో ఫ్లేమ్ మీద మరో ఐదు నిమిషాల పాటు మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని తీసుకెళ్లి ముందుగా నెయ్యిఅప్లై చేసుకున్న బౌల్​లో సమాంతరంగా సర్దుకున్న మిశ్రమంలో మరో లేయర్ కింద సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • ఆపై మూతపెట్టి అరగంట పాటు అలా వదిలేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​ మీద కోకో లేయర్ పైకి వచ్చేలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇక చివరగా ఆ పీసెస్​ మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పల్లీ పాలకోవా" రెడీ!

ABOUT THE AUTHOR

...view details