Good Parenting Tips :చిన్నతనంలో పిల్లలు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలు అల్లరి చేష్టలు ఎక్కువగా చేస్తుంటారు. మరికొందరు.. మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు మాత్రం ఇంట్లో అందరితో సాధారణంగా ఉంటూ.. ఎవరైనా ఇంటికి వస్తే బయటకు రాకుండా సిగ్గుతో దాచుకుంటుంటారు. ఇంటికి చుట్టాలు, అమ్మనాన్న కోసం స్నేహితులు వచ్చినప్పుడు.. వారిని చూసి బిడియంతో గది నుంచి బయటకు రారు.
మీ పిల్లలు కూడా ఇంట్లో అందరితో సాధారణంగా ఉంటూ.. ఇతరుల ఎదుట ఇలా బిడియపడుతుంటే వెంటనే గుర్తించి ఆ లక్షణాన్ని దూరం చేయడానికి ప్రయత్నించాలంటున్నారు మానసిక నిపుణులు. లేదంటే.. ఆ లక్షణం పిల్లల్లో పెరిగి పెద్దదై.. ఇంట్రావర్ట్‌లుగా మార్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. అయితే, పిల్లల్లో అలాంటి లక్షణం పోగొట్టాలంటే పేరెంట్స్‌గా ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇతరులతో పోల్చడం చేయరాదు :పిల్లల్లో ఇలాంటి లక్షణం రాకుండా ఉండాలంటే ఇతరులతో పోల్చడం అస్సలు చేయొద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలా చేయడం ద్వారా వారికంటే తాము తక్కువనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. అంతేకాదు.. ఇతరులతో పోల్చడం, చదువులో లేదా చురుకుదనంలో అవతలి వారికన్నా తక్కువ అన్నట్లు విమర్శించడం వంటివన్నీ పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని పెంచుతాయంటున్నారు. దాంతో వారు అందరి ముందుకు రావడానికి సిగ్గుపడతారు. కాబట్టి.. అలా కాకుండా పిల్లలు తమలోని భావోద్వేగాలను గుర్తించడానికి, వాటిని బహిర్గతం చేయడానికి పేరెంట్స్‌గా మీరు వారికి సహాయపడాలని సూచిస్తున్నారు.
మీ పిల్లలు దూకుడుగా వ్యవహరిస్తున్నారా? - ఈ టిప్స్‌తో సెట్ చేయండి - లేదంటే ఇబ్బందులే!