Onion Powder Recipe in Telugu :మన ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఆనియన్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. కూర, పప్పు, చారు ఇలా ప్రతి కూరలో రుచికోసం ఉల్లిని తప్పనిసరిగా వేస్తాం. ఇక పచ్చిపులుసు, ఆనియన్‌దోశల ఘుమాయింపంతా ఉల్లిలోనే ఉంటుంది. అది వేయడం వల్లే కూరలకు గ్రేవీ వస్తుంది. అయితే, కూరలు, స్నాక్స్ ఇలా ఏవైనా సరే ఎప్పుడూ రొటీన్ టేస్ట్‌తో ఉంటే ఎవరికైనా నచ్చవు. వాటినే ఎప్పటికప్పుడు కొత్తగా, మరింత టేస్టీగా చేసుకునేందుకు ప్రస్తుతం రకరకాల పౌడర్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఉల్లి పొడి.
కొన్ని రెసిపీలలో మీరు తరచుగా వాడే ఉల్లిపాయ తరుగు కంటే ఈ ఆనియన్ పొడిని వాడడం అదనపు రుచిని అందిస్తుంది. అయితే, ఎక్కువ ఖరీదు చెల్లించి రసాయనాలు కలిపిన పౌడర్‌ను బయట నుంచి కొనితెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. ఈవిధంగా ఇంట్లోనే నేచురల్‌గా చేసుకోవడం ద్వారా డబ్బు ఆదాతో పాటు రుచి, శుచిగానూ ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఉల్లి ధర ఎక్కువగా ఉంది. కాబట్టి ఓసారి ఇలా పొడి చేసుకుని పెట్టుకున్నారంటే తరచూ ఉల్లిగడ్డలు కొనకుండా చాలా రోజులు వివిధ కర్రీలలోయూజ్ చేసుకోవచ్చు. పైగా కర్రీలు మంచి టేస్టీగా ఉంటాయట. మరి, వంటకాలకు సరికొత్త టేస్ట్‌ని అందించే ఈ ఉల్లి పొడిని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.