తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ "మినప ఆవిరి కుడుములు"- బొంబాయి చట్నీ కాంబినేషన్​తో సూపర్​ టేస్ట్​!

-ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మినప ఆవిరి కుడుములు -ఇలా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరం

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Minapa Aaviri Kudumu
Minapa Aaviri Kudumu Recipe (ETV Bharat)

Minapa Aaviri Kudumu Recipe :ఇప్పుడు.. బ్రేక్​ఫాస్ట్​ అనగానే మనకు ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వంటి వివిధ రకాల ఐటమ్స్​ గుర్తుకు వస్తుంటాయి. కానీ, ఒకప్పుడు చాలా మంది మినప్పప్పుతో ఆవిరి కుడుములు చేసుకుని తినేవారు. ఈ కుడుములలో ఐరన్​, క్యాల్షియం వంటి వివిధ రకాల పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ వీటిని తినేవారు. మరి, పాతకాలం నాటి ఈ ఆవిరి కుడుములను సింపుల్​గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఆవిరి కుడుములకు కాంబినేషన్​గా బొంబాయి చట్నీ సూపర్​ టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటినీ ఎలా చేయాలో మీరు ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు..

  • పొట్టు మినప్పప్పు-పావు కేజీ
  • ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం..

  • ఆవిరి కుడుములు చేయడానికి మినప్పప్పు శుభ్రంగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పిండిని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కుడుములు చేయడానికి ఒక తెల్లటి కాటన్​ వస్త్రం, గిన్నె తీసుకోండి. గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి.. కాటన్​ వస్త్రాన్ని గిన్నెపైన పేర్చి అంచుల కింద దారంతో టైట్​గా కట్టండి.
  • తర్వాత వస్త్రం పైన మినపపిండి వేసి చేతితో మొత్తం స్ప్రెడ్​ చేయండి. ఇప్పుడు వస్త్రాన్ని పిండిపై వేసి.. మూత పెట్టండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి 25 నిమిషాలు ఉడికించుకోండి.
  • కుడుములు ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా మిగిలిన పిండితో వీలైనన్ని ఆవిరి కుడుములు చేసుకోవాలి.
  • ఇలా చేస్తే ఎంతో రుచికరమైన మినప ఆవిరి కుడుములు రెడీ. వీటిని బొంబాయి చట్నీతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. సింపుల్​గా బొంబాయి చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Bombay Chutney Recipe :

బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలు..

  • 2 టీ స్పూన్ల నూనె
  • ఆవాలు-అర టీ స్పూన్
  • శనగపప్పు-టీ స్పూన్
  • మినప్పప్పు-టీ స్పూన్
  • జీలకర్ర- అర టీ స్పూన్
  • ఎండు మిరపకాయలు- 2
  • ఒక రెబ్బ కరివేపాకు
  • 2 పచ్చి మిరపకాయలు
  • పావుకిలో ఉల్లిపాయ ముక్కలు
  • అర టీ స్పూన్ పసుపు
  • రుచికి సరిపడా ఉప్పు
  • 2 టీ స్పూన్ల శనగపిండి
  • ఒక టీ స్పూన్ అల్లం తరుగు
  • ఉడకబెట్టిన బంగాళ దుంప (ఆప్షనల్)
  • ఒక టీ స్పూన్ నిమ్మరసం (ఆప్షనల్)
  • కొత్తిమీర (ఆప్షనల్)

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో ఆయిల్​ పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి.
  • తాలింపు వేగాక ఎండు మిరపకాయలు, కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయలను వేగిన తర్వాత అర లీటర్ నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 12 నిమిషాల పాటు స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి ఉడికించుకోవాలి.
  • ఇది ఉడుకుతున్న టైమ్​లో శనగపిండిలో 50 మిల్లీ లీటర్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి.
  • ఇప్పుడు శనగపిండి మిశ్రమం, అల్లం తరుగు, వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసుకోండి అంతే రుచికరమైన బొంబాయి చట్నీ రెడీ.
  • ఇందులోకి అవసరమైతేనే ఉడకబెట్టిన పొటాటో, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకోవచ్చు.

నిమిషాల్లోనే "అలసందల తాలింపు" రెడీ - ఇలా చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

ఉల్లిపాయతో అద్దిరిపోయే పరోటా గురూ! - ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్​ లిస్టులో చేరిపోద్ది!

ABOUT THE AUTHOR

...view details