తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కేవలం బియ్యం పిండితో "కరకరలాడే కారం చిప్స్" - నిమిషాల్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండిలా! - Karam Chips - KARAM CHIPS

Karam Chips Recipe : చిప్స్ అనగానే.. చాలా మందికి బంగాళదుంపతో ప్రిపేర్ చేసుకునేవే ముందుగా గుర్తొస్తాయి. కానీ, ఈసారి డిఫరెంట్​గా బియ్యప్పిండితో 'కారం చిప్స్' ప్రిపేర్ చేసుకొని చూడండి. క్రిస్పీగా, క్రంచీగా ఉండే వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! మరి, వీటిని తయారు చేసుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం.

How to Make Crunchy Karam Chips
Karam Chips Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 24, 2024, 3:36 PM IST

Karam Chips with Rice Flour in Telugu : వాతావరణం కూల్​గా ఉన్నప్పుడు సాయంకాలం కారం కారంగా ఏదైనా తినాలనిపించడం సహజం. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లోనే పకోడీలో, సమోసాలో చేసుకుంటే.. మరికొందరు ఆలూ చిప్స్ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ బంగాళదుంపతోనే కాకుండా ఈసారి వెరైటీగా ఇలా బియ్యప్పిండితో "కరకరలాడే కారం చిప్స్" ప్రిపేర్ చేసుకోండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - 1 కప్పు(పావు కిలో)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • నువ్వులు - 1 టీస్పూన్
  • నెయ్యి/బటర్ - 1 టేబుల్ స్పూన్
  • పసుపు - చిటికెడు
  • నూనె - వేయించడానికి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో బియ్యప్పిండిని తీసుకొని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని బియ్యప్పిండిని తీసుకున్న కప్పుతో ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, నువ్వులు, సన్నగా తరుక్కున్న కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి/బటర్, పసుపు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఆ నీళ్లను బాగా వేడి చేసుకోవాలి.
  • నీళ్లు బాగా మరిగాయనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకొని జల్లెడ పట్టుకున్న బియ్యప్పిండిని అందులో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి.
  • ఆ విధంగా కలుపుకున్నాక.. ఆ మిశ్రమాన్ని మళ్లీ మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. అది కాస్త గోరువెచ్చగా అయ్యాక చేతితో అవసరాన్ని బట్టి చల్లని నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • అయితే, పిండిని మరీ పల్చగా కాకుండా పూరీ పిండిలా సెమీ సాఫ్ట్​గా కలుపుకోవాలి. పిండిని అలా కలుపుకోవడం వల్ల చిప్స్ కరకరలాడుతూ రావడమే కాకుండా ఆయిల్ ఎక్కువ పట్టకుండా చాలా బాగా వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • 10 నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత.. అందులో నుంచి బాల్ సైజంత పిండిని తీసుకొని చేతితో రౌండ్​గా చేసుకొని పొడి పిండిని అన్ని వైపులా అద్దుకోవాలి.
  • ఇప్పుడు.. చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఆ పిండి ముద్దను చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు పిండి అతుక్కపోయినట్లనిపిస్తే చపాతీలా చేసుకునే పిండి పైన కింద కొంచం పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి.
  • అయితే.. మరీ మందంగా, పల్చగా కాకుండా చపాతీ కంటే కాస్త మందంగా ఉండేలా ఆ పిండి ముద్దను రోల్ చేసుకోవాలి.
  • ఆ విధంగా రోల్ చేసుకున్నాక.. దాన్ని పిజ్జా కట్టర్ లేదా చాకు సహాయంతో ముందుగా స్క్వేర్ షేప్ వచ్చేలా సైడ్స్ కట్ చేసుకోవాలి.
  • ఆపై దాన్ని ముందుగా చిన్న చిన్న స్క్వేర్ బాక్సులు వచ్చేలా కట్ చేసుకొని తర్వాత త్రిభుజాకారం లేదా డైమండ్ షేప్​ వచ్చేలా కట్ చేసుకొని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక.. కట్ చేసుకున్న ట్రై యాంగిల్ చిప్స్ వేసి వేయించుకోవాలి.
  • అయితే, చిప్స్ వేయించుకునేటప్పుడు నూనెలో వేశాక వెంటనే వాటిని టర్న్ చేయకుండా కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత గరిటెతో తిప్పుకుంటూ మంచిగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "కరకరలాడే కారం చిప్స్" రెడీ!

ABOUT THE AUTHOR

...view details