IRCTC Uttarandhra Tour:ప్రముఖ పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వీలుగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు కొత్త టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాలను కవర్ చేస్తూ ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ట్రిప్ ద్వారా మీరు చాలా తక్కువ బడ్జెట్లోనే వివిధ టూరిస్ట్ ప్లేసెస్ చూడొచ్చు. ఈ ప్యాకేజీ ద్వారా ఏ ఆలయాలను చూడొచ్చు ? ట్రిప్ ఎన్ని రోజులుంటుంది ? ధర ఎంత ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
IRCTC 'ఉత్తరాంధ్ర వరల్డ్ ఫేమస్ టెంపుల్' (Uttarandhra World Famous Temple) పేరుతో ఈ టూర్‌ని ఆపరేట్ చేస్తోంది. ఉత్తరాంధ్ర టూర్ విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్‌కు మీరు వెళ్లాలనుకుంటే ఫస్ట్ మీరు విశాఖపట్టణం చేరుకోవాలి. తర్వాత అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక రాత్రి, రెండు పగళ్లు ఉండే ఈ టూర్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని IRCTC వెల్లడించింది.
టూర్ ఇలా సాగుతుంది :
మొదటిరోజు పర్యాటకుల్ని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ దగ్గర పికప్ చేసుకుంటారు. హోటల్‌కి చేరుకుని బ్రేక్‌ఫాస్ట్ చేసి అరసవిల్లి బయల్దేరాలి. అక్కడ శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. భోజనం తర్వాత శ్రీకాకుళం వెళ్తారు. అక్కడ శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే శ్రీముఖలింగంలో శ్రీముఖలింగేశ్వరస్వామి ఆలయాన్ని చూస్తారు. అక్కడి నుంచి విశాఖపట్టణానికి బయలుదేరతారు. నైట్ విశాఖలోనే స్టే చేస్తారు.