IRCTC Thailand Package Details: థాయ్‌లాండ్.. ఇంటర్నేషనల్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్లలో ఇదీ ఒకటి. ముఖ్యంగా యూత్కైతే ఫేవరెట్ డెస్టినేషన్. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే బ్యాంకాక్ బీచ్‌లో ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు కాబట్టి. అయితే ఇంటర్నేషనల్ టూర్ అనగానే ధర ఎక్కువని అనుమానం రావడం సహజం. కానీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అందుబాటు ధరలోనే థాయ్‌లాండ్ అందాల్ని ఆస్వాదించేందుకు ఓ ప్యాకేజీ అందిస్తోంది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
"ట్రెజర్స్ ఆఫ్ థాయ్‌లాండ్ ఎక్స్ హైదరాబాద్(Treasures of Thailand Ex Hyderabad)" పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ యాత్ర మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ సాగుతుంది థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలైన పట్టయ, బ్యాంకాక్‌లో పలు ప్రదేశాలను వీక్షించొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రాత్రి 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోవాలి.
- రెండో రోజు అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి లగేజ్ తీసుకుని.. అక్కడి నుంచి పట్టయకు బయలుదేరుతారు. ముందుగానే బుక్ చేసిన హోటల్లో చెకిన్ అవ్వాలి. ఫ్రెషప్ అనంతరం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత హోటల్లోనే మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటారు. లంచ్ తర్వాత పట్టయలోని జెమ్స్ గ్యాలరీ సందర్శిస్తారు. ఆ సాయంత్రం అల్కజార్ షోను వీక్షించి.. రాత్రి ఇండియన్ రెస్టరెంట్లో డిన్నర్ చేస్తారు. ఇక ఆ రాత్రికి పట్టయలో బస ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కోరల్ ద్వీపంలో స్పీడ్ బోటింగ్ ఉంటుంది. అక్కడే బీచ్‌లో సేదదీరొచ్చు. లంచ్ కూడా ఉంటుంది. సాయంత్రం నూంగ్ నుచ్ ట్రోపికల్ గార్డెన్ విజిట్ చేస్తారు. పట్టయ తిరిగి రావడంతో ఆరోజు పూర్తవుతుంది. ఆ రాత్రికి డిన్నర్ అక్కడే చేసి స్టే చేయాలి.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి సఫారీ వరల్డ్ టూర్ అండ్ మెరైన్ పార్క్ విజిట్ చేస్తారు. సాయంత్రానికి బ్యాంకాక్‌కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు. ఆ రాత్రి బ్యాంకాక్‌లోనే స్టే ఉంటుంది.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను విజిట్ చేస్తారు. లంచ్ తర్వాత బ్యాంకాక్‌లోని గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ సందర్శిస్తారు. తర్వాత షాపింగ్ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు. భాగ్యనగరం చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ - థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీ ధరలు :
- సింగిల్ షేరింగ్ కు రూ.64,190, డబుల్ షేరింగ్‌కు రూ.55,860, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.55,860 గా నిర్ణయించారు.
- చిన్నారులకు చైల్డ్ విత్ బెడ్ అయితే రూ.53,860గా, విత్ అవుట్ బెడ్ అయితే రూ.48,860గా ధరలు ఉన్నాయి.