తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కార్తికమాసం స్పెషల్​ - శ్రీశైలం దర్శించుకునేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - పైగా యాదాద్రి వెళ్లొచ్చు!

-ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను తీసుకొస్తున్న ఐఆర్​సీటీసీ -అందుబాటు ధరలోనే ఎన్నో ప్రదేశాలు చూడవచ్చు

IRCTC Spiritual Telangana with Srisailam
IRCTC Spiritual Telangana with Srisailam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

IRCTC Spiritual Telangana with Srisailam:శనివారం(నవంబర్​ 2) నుంచి కార్తీక మాసం మొదలుకానుంది. ఈ మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఈ కార్తికంలో ద్వాదశ జ్యోత్యిర్లింగాలు దర్శించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కనీసం ఒక్క జ్యోతిర్లింగాన్ని అయినా దర్శించాలని భావిస్తుంటారు. మరి మీరు కూడా అదే ప్లాన్​లో ఉన్నారా? మీకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ గుడ్​న్యూస్​ చెబుతోంది. 12 జ్యోతిర్లింగాలలో ఒక్కటైనా శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్యాకేజీ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఐఆర్‌సీటీసీ టూరిజం "Spiritual Telangana with Srisailam" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ఈ టూర్​ 3 రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ప్రతీ ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్​ను ఆపరేట్​ చేస్తారు. ఈ ప్యాకేజీలో శ్రీశైలం, యాదాద్రి పుణ్యక్షేత్రాలు సహా హైదరాబాద్​లోని పలు పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్‌/ సికింద్రాబాద్‌/కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రయాణికులను ఐఆర్​సీటీసీ సిబ్బంది పికప్‌ చేసుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవ్వాలి. ఆ తర్వాత చార్మినార్‌, సలార్‌జంగ్‌ మ్యూజియం, లుంబిని పార్క్‌ సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్​కు చేరుకుంటారు. ఆ రాత్రికి హైదరాబాద్​లో బస ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్​ నుంచి శ్రీశైలానికి జర్నీ స్టార్ట్​ అవుతుంది. మార్గమధ్యలో బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లిఖార్జున స్వామి దర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి స్థానిక ఆలయాలను దర్శించుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్​ బయలుదేరుతారు. ఆ రాత్రికి హైదరాబాద్​లోనే బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత బిర్లా మందిర్​కు తీసుకెళ్తారు. ఆ తర్వాత గోల్కోండ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్​ తర్వాత అంబేడ్కర్ విగ్రహంతో పాటు స్థానికంగా ఉన్న పలు సందర్శనీయ ప్రదేశాలను చూపిస్తారు. మూడో రోజు రాత్రికి హైదరాబాద్​లోనే బస చేస్తారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ చెక్​ అవుట్​ చేయాలి. ఆ తర్వాత యాదాద్రికి వెళ్తారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో పాటు సురేంద్రపురి కూడా విజిట్​ చేస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.

ధరల వివరాలు: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ టూరిజం ప్యాకేజీ ధరలను చూస్తే..

  • సింగిల్ షేరింగ్​కు రూ. 37,200, డబుల్ షేరింగ్​కు రూ. 19,530, ట్రిపుల్ షేరింగ్​కు రూ. 14,880గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు విత్​ బెడ్​తో రూ. 9,780, విత్​ అవుట్​ బెడ్​తో రూ. 9,780 గా నిర్ణయించారు.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • హోటల్​ అకామిడేషన్​
  • 3 డిన్నర్​, 2 బ్రేక్​ఫాస్ట్​
  • ప్యాకేజీ షేరింగ్​ను బట్టి ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 6వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు.

హైదరాబాద్​ To శ్రీలంక - రామాయణ ఇతిహాసాలు చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ!

అటు ఆధ్యాత్మిక దర్శనాలు - ఇటు పర్యాటక ప్రదేశాలు - IRCTC అద్భుత ప్యాకేజీ! ధర కూడా తక్కువేనండోయ్​!

ABOUT THE AUTHOR

...view details