తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అల "ఊటీ అందాల్లో" విహరించండి? - తక్కువ ధరకే ఆరు రోజుల పాటు IRCTC ప్యాకేజీ! - వివరాలివే!

ఊటీ అందాలను చూసి ఎంజాయ్​ చేసేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Ooty Tour Packages
IRCTC Ultimate Ooty Tour Package (ETV Bharat)

IRCTC Ultimate Ooty Tour Package:ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్​ ఊటీ. పచ్చని ప్రకృతిలో.. అందమైన సరస్సుల పక్కనుంచి.. ఎత్తైన కొండల మధ్య ప్రయాణం చేస్తే ఎంతో థ్రిల్లింగ్​గా ఉంటుంది. మరి అలాంటి ఫీల్​ను మీరూ పొందాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC). ఊటీ అందాలను చూసేందుకు ఓ ప్యాకేజీని అందిస్తోంది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎలా ఉంటుంది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

"అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్(ULTIMATE OOTY EX HYDERABAD)" పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. ట్రైన్​ జర్నీ ద్వారా టూర్​ ఉంటుంది. ప్రతి మంగళవారం హైదరాబాద్​ నుంచి ట్రైన్​ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. టూర్​ పూర్తయ్యాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. కూనూర్​, ఊటీలోని పలు ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటిరోజు మధ్యాహ్నం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ఐఆర్‌సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్‌లో చెకిన్​ చేయాలి. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు. రెండో రోజు రాత్రి ఊటీలో హోటల్‌లోనే బస ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్​ఫాస్ట్​ చేయాలి. ఆ తర్వాత దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ ఊటీలోనే స్టే చేయాలి.
  • నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం కూనూర్‌ పర్యటనకు తీసుకెళ్తారు. అక్కడ పలు ప్రదేశాలు సందర్శించిన తర్వాత తిరిగి ఊటీకి చేరుతారు. రాత్రి మళ్లీ హోటల్‌లో బస ఉంటుంది.
  • ఐదో రోజు అదే హోటల్‌లో టిఫెన్​ చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్‌ పయనమవుతారు. సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) ఎక్కాలి. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్​ పూర్తవతుంది.

ధర వివరాలు:

కంఫర్ట్‌ (థర్డ్‌ ఏసీ బెర్త్‌): ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్​కు రూ.33,390, ట్విన్ షేరింగ్‌కు రూ.18,660, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,990 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,470, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,220 చెల్లించాలి.

స్టాండర్డ్‌ (స్లీపర్‌ బెర్త్‌): సింగిల్ షేరింగ్​కు రూ.30,930, ట్విన్ షేరింగ్‌కు రూ.16,210, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,530. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.7,020, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,770 చెల్లించాలి. గ్రూప్‌ బుకింగ్‌పై కొంత మేర తగ్గుతుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • ప్యాకేజీని బట్టి ట్రాన్స్​పోర్ట్​ కోసం బస్సు సౌకర్యం
  • నాన్​ ఏసీ అకామిడేషన్​ విత్​ బ్రేక్​ఫాస్ట్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ అక్టోబర్​ 15, అక్టోబర్​ 22, నవంబర్​ 12వ తేదీల్లో అందుబాటులో ఉంది.
  • ఈ టూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC సూపర్​ ప్యాకేజీ - మీనాక్షి అమ్మన్​ ఆలయంతోపాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! - ధర కూడా అందుబాటులోనే!

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

ABOUT THE AUTHOR

...view details