IRCTC Magical Malaysia With Singapore Sensation: ప్రపంచ బెస్ట్ టూర్టిస్ట్ స్పాట్‌గా సింగపూర్ విరాజిల్లుతోంది. విశాలమైన జూలాజికల్ గార్డెన్స్, ఉద్యానవనాలకు నిలయంగా ఉంది. దీంతో నిత్యం వేల మంది పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. మరి మీరు అక్కడికి వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? కానీ ఎలా వెళ్లాలో తెలియడం లేదా? నో వర్రీ. సింగపూర్, మలేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలను తక్కువ ఖర్చుతో చుట్టేసి రావాలనుకుంటున్న వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజుల? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మ్యాజికల్ మలేసియా విత్ సింగపూర్ సెన్సేషన్(Magical Malaysia With Singapore Sensation) పేరుతో ఐఆర్సీటీసీ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు కొనసాగనుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ప్రయాణ వివరాలు చూస్తే..
మొదటి రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అర్ధరాత్రి 12:30 ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఉదయం 7:30 గంటలకు కౌలాలంపూర్‌కు రీచ్ అవుతారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. చెకిన్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం వరకు రెస్ట్ తీసుకుంటారు. లంచ్ తర్వాత పుత్రజయ విజిట్ చేసి, షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి డిన్నర్ ఇండియన్ రెస్టరెంట్లో ఉంటుంది. అలాగే ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి.
రెండో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బటు కేవ్స్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత జెంటింగ్ హైలాండ్స్ సందర్శించి తిరిగి కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూడా అక్కడే స్టే చేయాలి.
IRCTC నార్త్ ఇండియా టూర్ - మాతా వైష్ణోదేవి ఆలయంతోపాటు మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!
మూడో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కౌలాలంపూర్ నగర పర్యటనకు వెళ్తారు. ఇండిపెండెన్స్ స్క్వేర్, కింగ్స్ ప్యాలెస్, నేషనల్ మాన్యుమెంట్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత పెట్రోనాస్ ట్విన్ టవర్ (స్కై బ్రిడ్జ్ ఎంట్రీ) సందర్శిస్తారు. లంచ్ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేస్తారు. బెర్జియా టైమ్స్ స్క్వేర్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆ రాత్రికి కౌలాలంపూర్‌లో డిన్నర్ చేసి అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింగపూర్‌కు బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత బే గార్డెన్స్ విజిట్ చేస్తారు. ఆ రాత్రికి డిన్నర్ చేసి సింగపూర్‌లో స్టే చేయాలి.