IRCTC Magical Madhya Pradesh Package: దేశంలోని గొప్ప పర్యాటక రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆధ్యాత్మికత, చారిత్రక, ప్రపంచ వారసత్వ సంపద, ప్రకృతి రమణీయత, వన్యప్రాణి సంరక్ష కేంద్రాలు బోలెడున్నాయి ఉన్నాయి ఇక్కడ చూడటానికి. అయితే వీటిలో కొన్ని ప్రదేశాలు చూసే విధంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ మ్యాజికల్ మధ్యప్రదేశ్(Magical Madhya Pradesh ) పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగతుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా మధ్యప్రదేశ్ చుట్టేసి రావొచ్చు. ఈ టూర్లో భోపాల్, జబల్పూర్, పచ్మార్హి వంటి ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ట్రైన్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8 గంటలకు భోపాల్ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అండ్ ఫ్రెషప్ తర్వాత సాంచికి స్టార్ట్ అవుతారు. అక్కడ సాంచి స్థూప సందర్శిస్తారు. ఆ తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శించుకుంటారు. తిరిగి భోపాల్ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్ మ్యూజియం విజిట్ చేస్తారు. ఆ రాత్రికి భోపాల్‌లోనే స్టే చేస్తారు.
బెస్ట్ రిలాక్సేషన్ టూర్ - కేరళకు IRCTC సూపర్ ప్యాకేజీ - గాడ్స్ ఓన్ కంట్రీలో 7 రోజులు!
- మూడో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పచ్మార్హికి బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. ఫ్రీ టైమ్‌లో అక్కడి ప్లేస్‌లు చూడొచ్చు. ఆ తర్వాత ఆ రాత్రికి హోటల్లో స్టే చేయాలి.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పాంచ్ పాండవ్ కేవ్స్, జట శంకర్ టెంపుల్ దర్శించుకుంటారు. అలాగే బీ ఫాల్స్, సన్‌సెట్ పాయింట్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత జబల్పూర్ బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. మధ్యాహ్నం మార్బుల్ రాక్స్, ధుంధర్ జలపాతం విజిట్ చేస్తారు. ఆ తర్వాత జబల్పూర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- ఆరో రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
హైదరాబాద్ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!