IRCTC Koffee With Karnataka Package: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కూర్గ్ చూసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. కూర్గ్ అందాలతో పాటు ప్రకృతి అందాలను కూడా చూడొచ్చు. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఐఆర్సీటీటీ కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka) పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు/6 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్యాకేజీలో బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్‌లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
ప్రయాణం ఇలా:
- మొదటి రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఉదయం 6:45గంటలకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత అక్కడ పికప్ చేసుకుని మైసూర్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి మైసూర్ చేరుకుని హోటల్‌లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ విజిట్ చేస్తారు. రాత్రికి మైసూర్‌లో బస ఉంటుంది.
- రెండో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మెల్కోటేకి బయలుదేరతారు. అక్కడ చెలువనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సోమనాథపుర, తలకాడు ఆలయాలకు బయలుదేరతారు. అక్కడ దర్శనం అనంతరం తిరిగి సాయంత్రానికి మైసూర్ చేరుకుంటారు. రాత్రికి మైసూర్‌లోనే బస చేస్తారు.
హైదరాబాద్ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!
- మూడో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూర్గ్‌కి బయలుదేరతారు. ఈ మార్గంలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా చూడవచ్చు. ఆ తర్వాత కూర్గ్ చేరుకుని హోటల్‌లో చెకిన్ అవుతారు. మధ్యాహ్నం రాజా సీట్‌ను సందర్శిస్తారు. రాత్రికి కూర్గ్‌లో బస ఉంటుంది.
- నాలుగో రోజు హోటల్‌లో టిఫెన్ తర్వాత తాలా కావేరికి వెళ్తారు. కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కూర్గ్‌కు తిరిగి వెళ్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.
- ఐదో రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి సకలేష్‌పూర్‌కి బయలుదేరతారు. మంజీరాబాద్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం హాసన్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్‌లో దిగి, ఆ రాత్రికి హాసన్‌లోనే బస చేస్తారు.
- హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి బేలూర్కి బయలుదేరతారు. అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హళేబీడుకి వెళ్లి హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బెంగళూరుకు వస్తారు. సాయంత్రానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.