తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / offbeat

IRCTC "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​" - అందుబాటు ధరలోనే 8 రోజుల టూర్​! - Happy Himachal and Popular Punjab

IRCTC Tour Packages : హిమాచల్​ ప్రదేశ్​ చూడాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది ఐఆర్​సీటీసీ టూరిజం. అందుబాటు ధరలోనే హిమాచల్​ ప్రదేశ్​, పంజాబ్​లోని పలు ప్రదేశాలు చూసేందుకు ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Tour Packages
IRCTC Tour Packages (ETV Bharat)

IRCTC ​Happy Himachal and Popular Punjab:చాలా మంది కొత్త కొత్త ప్లేస్​లను చూసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అందులో భాగంగానే కొందరు అధ్యాత్మిక పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే.. మరికొందరూ సేద తీరేందుకు అనువైన ప్లేస్​లు వెతుకుంటారు. అయితే.. ఇలాంటి వారందరికీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది IRCTC టూరిజం. తాజాగా హిమాచల్​ ప్రదేశ్​, పంజాబ్​లోని ప్రముఖ ప్రదేశాలను వీక్షించేందుకు అనుగుణంగా అందుబాటు ధరలోనే ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ప్రయాణం ఎన్ని రోజులు? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే వివరాలు చూద్దాం.

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ "హ్యాపీ హిమాచల్​ అండ్​ పాపులర్​ పంజాబ్​(​Happy Himachal and Popular Punjab)" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్​ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. అమృత్​ సర్​, చండీగఢ్​​, దాల్​హౌజ్​, ధర్మశాల, సిమ్లా వంటివి కవర్​ చేయవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. మధ్యాహ్నానికి అమృత్​ సర్​ చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత లంచ్​ చేస్తారు. ఆ తర్వాత అట్టారీ-వాఘా సరిహద్దు విజిట్​ చేస్తారు. సాయంత్రం గోల్డెన్​ టెంపుల్​ దర్శించుకుంటారు. ఆ రాత్రికి అమృత్​ సర్​లో డిన్నర్​ చేసి బస చేస్తారు.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ చేసి దాల్ హౌసికి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి.. మాల్​ రోడ్​ విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి భోజనం, బస దాల్​హౌసిలో ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఖజ్జియర్​కు స్టార్ట్​ అవుతారు. అక్కడ పలు ప్రదేశాలు విజిట్​ చేసిన తర్వాత ధర్మశాలకు పయనమవుతారు. రాత్రికి ధర్మశాలకు చేరుకుని హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత మెక్‌లియోడ్ గంజ్ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత ధర్మశాలలోని పలు ప్రదేశాలు సందర్శిస్తారు. ఆ రాత్రికి డిన్నర్​ చేసి అక్కడే బస చేస్తారు.

సింగపూర్​ వెళ్తారా? - తక్కువ ధరలోనే IRCTC సూపర్​ ప్యాకేజీ - మలేసియా కూడా చుట్టేయొచ్చు!

  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సిమ్లాకు బయలుదేరుతారు. మార్గ మధ్యలో జ్వాలాముఖి విజిట్​ చేసి రాత్రికి సిమ్లా చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత డిన్నర్​ చేసి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కుఫ్రీ చేరుకుంటారు. అక్కడ పలు ప్రదేశాలు విజిట్​ చేస్తారు. ఆ తర్వాత తిరిగి సిమ్లా చేరుకుంటారు. సాయంత్రం మాల్​ రోడ్​ చూసి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • ఏడో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయిన తర్వాత చండీగఢ్​ బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి.. సాయంత్రం లీజర్​​ వ్యాలీ విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
  • ఎనిమిదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత రాక్​ గార్డెన్​, సుకానా లేక్​ విజిట్​ చేస్తారు. ఆ తర్వాత చండీగఢ్​ ఎయిర్​పోర్ట్​కు చేరుకుని హైదరాబాద్​ బయలుదేరుతారు. భాగ్యనగరానికి చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే :

  • కంఫర్ట్​లో.. సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.60,200, డబుల్​ ఆక్యూపెన్సీ రూ 45,000, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.42,300 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.35,500, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.33,150 చెల్లించాలి.
  • 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు రూ.23,850 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు(హైదరాబాద్​ - అమృత్​సర్/ చండీగఢ్​ - హైదరాబాద్​)
  • అకామిడేషన్​
  • 7 రోజులు బ్రేక్​ఫాస్ట్​ అండ్​ డిన్నర్, 1 రోజు లంచ్​ ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికిల్​ అరెంజ్​ చేస్తారు.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్​ 16వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

ఐఆర్​సీటీసీ "మ్యాజికల్​ మధ్యప్రదేశ్​" - సాంచి స్థూపంతో పాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర చాలా తక్కువ!

బెస్ట్ రిలాక్సేషన్ టూర్ - కేరళకు IRCTC సూపర్ ప్యాకేజీ - గాడ్స్​ ఓన్ కంట్రీలో 7 రోజులు!

ABOUT THE AUTHOR

...view details