IRCTC Mesmerizing Meghalaya and Assam: ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి.. కూల్ ప్లేస్‌లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకునేందుకు సూపర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రశాంతమైన, సుందరమైన, ఉత్కంఠ భరితమైన ప్రదేశాలు చూడాలని భావించే వారు ఈ టూర్‌కు వెళ్లొచ్చు. మరి ఈ టూర్ ఎప్పుడు? ఎన్ని రోజులు సాగుతుంది? ఏఏ ప్రదేశాలు కవర్ చేయొచ్చు? ధర ఎంత? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఐఆర్‌సీటీసీ మెస్మరైజింగ్ మేఘాలయ అండ్ అస్సాం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మీరు ఈ టూర్‌లో భాగంగా షిల్లాంగ్, చిరపుంజి, గువాహటి వంటి ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. మెుత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.
ప్రయాణ వివరాలు చూస్తే..
మొదటి రోజు హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 9:25 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నానికి గువాహటి చేరుకుంటారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకుని షిల్లాంగ్ తీసుకెళ్తారు. షిల్లాంగ్ చేరుకున్న తర్వాత లోకల్ మార్కెట్ సందర్శించొచ్చు. రాత్రికి షిల్లాంగ్‌లోనే బస చేయాలి.
రెండో రోజుహోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చిరపుంజి ట్రిప్ ఉంటుంది. అక్కడ ఎలిఫాంటా ఫాల్స్, వ్యూ పాయింట్, నోహ్కలికై జలపాతం, మావ్స్మై గుహలు, సెవన్ సిస్టర్ వాటర్‌ఫాల్స్ విజిట్ చేయొచ్చు. రాత్రికి తిరిగి షిల్లాంగ్ చేరుకుని అక్కడే బస చేస్తారు.
మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత దావ్కీ లేక్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత మావ్లిన్‌నాంగ్, లివింగ్ రూట్ బ్రిడ్జ్ సందర్శిస్తారు. సాయంత్రానికి షిల్లాంగ్ చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
సింగపూర్ వెళ్తారా? - తక్కువ ధరలోనే IRCTC సూపర్ ప్యాకేజీ - మలేసియా కూడా చుట్టేయొచ్చు!