ETV Bharat / entertainment

మోదీకి థాంక్స్ చెప్పిన నాగచైతన్య, శోభిత- ఎందుకంటే? - NAGA CHAITANYA THANKS TO MODI

ప్రధాని మోదీకి థాంక్య్ చెప్పిన అక్కినేని నాగచైతన్య- ఎందుకో తెలుసా?

Naga Chaitanya Thanks To MODI
Naga Chaitanya Thanks To MODI (Source : ANI, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 10:09 AM IST

Naga Chaitanya Thanks To MODI : టాలీవుడ్ యంగ్ కపుల్ అక్కినేని నాగచైతన్య- శోభిత ప్రధాని నరేంద్ర మోదీకి థాంక్స్ చెప్పారు. ఆయన నుంచి ప్రశంసలు పొందడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చైతన్య దంపతులు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్​లు పెట్టారు. మరి మోదీకి చైతన్య- శోభిత కపుల్ ఎందుకు థాంక్స్ చెప్పారంటే?

ప్రధాని మోదీ తాజాగా 'మన్​కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడారు. ఈ ప్రోగ్రామ్​లో అక్కినేని నాగేశ్వరరావును మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. 'ఏయన్నార్‌ తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారు' అని మోదీ అన్నారు. దీనిపై స్పందించిన నాగచైతన్య దంపతులు మోదీకి థాంక్స్‌ చెబుతూ పోస్ట్‌లు షేర్ చేశారు.

'అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని పోస్ట్​ చైతన్య, శోభిత తమతమ సోషల్ మీడియా అకౌంట్​లలో పోస్ట్​ చేశారు.

నాగార్జున కూడా
అక్కినేని నాగేశ్వరరావు గురించి మోదీ ప్రస్తావించడంపై అక్కినేని నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ఆయన కూడా మోదీకి ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ షేర్ చేశారు. 'ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏయన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏయన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి' అని నాగార్జున పేర్కొన్నారు.

కాగా, నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మోండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సాయి పల్లవి హీరోయిన్​గా నటిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియో గ్లింప్స్​నకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గీతా ఆర్ట్స్​ బ్యానర్​పై అల్లు అరవింద్, బన్ని వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

'తండేల్' సాలిడ్ అప్డేట్- మూడు రోజుల్లో ఫ్యాన్స్​కు ట్రీట్!

బుజ్జితల్లి ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్​ వీడియో - Happy Birthday Sai pallavi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.