IRCTC Highlights of Hyderabad with Srisailam : ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని, పర్యాటక ప్రదేశాలను చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే పలు కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి వారి కోసమే ఐఆర్సీటీసీ ఒక మంచి టూర్ ప్యాకేజీని అందిస్తోంది. కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్యాకేజీ ఎప్పుడు మొదలువుతుంది? ధర ఎంత? ప్రయాణం ఎలా? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఐఆర్సీటీసీ టూరిజం "Highlights of Hyderabad with Srisailam" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ఇది 3 రాత్రులు, 4 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్ ప్రతీ ఆదివారం నుంచి గురువారం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు శ్రీశైలం కవర్ అవుతుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు.
ప్రయాణ వివరాలు :
- మొదటి రోజు హైదరాబాద్/ సికింద్రాబాద్/ కాచీగూడ రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికులను పికప్ చేసుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్లో చెకిన్ అనంతరం చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం బయలుదేరుతారు. శ్రీశైలం చేరుకుని మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి స్థానిక ఆలయాలను చూసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. ఆ రాత్రికి భాగ్యనగరంలో స్టే చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం రామోజీ ఫిల్మ్‌సిటీ విజిట్ ఉంటుంది. ఆ రోజంతా అక్కడ ఎంజాయ్ చేసి రాత్రికి హోటల్‌కు చేరుకుని అక్కడే స్టే చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి బిర్లా మందిర్, గోల్కోండ కోట, కుతుబ్షాహి టూంబ్స్ విజిట్ చేస్తారు. అనంతరం తిరిగి సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్లలో డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు ఇవే:
- 1 నుంచి 3 ప్రయాణికులకు..సింగిల్ షేరింగ్‌కు రూ.36,270, డబుల్ షేరింగ్‌కు రూ.19,070, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.14,570 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.9,590, విత్ అవుట్ బెడ్ రూ.9,590 పే చేయాలి.
- 4 నుంచి 6 ప్రయాణికులకు.. డబుల్ షేరింగ్‌కు రూ.15,110, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,030 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.9,590, విత్ అవుట్ బెడ్ రూ.9,590 పే చేయాలి.