తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 2:34 PM IST

ETV Bharat / offbeat

అందమైన ఊహాలోకం- అందులో అన్నీ అద్భుతాలే- వాటిలో మీరు కోరుకునేదేంటి? - Fictional Gadgets

Fictional Gadgets: ప్రతి ఒక్కరికీ ఓ ఊహాలోకం ఉంటుంది. అందులో కలలు కంటూ తేలియాడుతూ ఉంటారు. ఇలా ఉంటే బాగుండు.. అలా ఉంటే బాగుండు.. అని అనుకుంటారు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది కదా.. మరి అలాంటప్పుడు మన కోర్కెల్ని నెరవేర్చే మిషన్లు కూడా కనిపెడితే ఎలా ఉంటుంది? ఒకవేళ అలాంటి ఫిక్షనల్ మిషన్లు పుట్టుకొస్తే వాటిలో మీరు ఏది కోరుకుంటారు?

Fictional_Gadgets
Fictional_Gadgets (ETV Bharat)

Fictional Gadgets: ఇది స్మార్ట్ యుగం. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు పుట్టుకొస్తున్నాయి. అయితే మనకు ఇంకా కొన్ని లోట్లు అలానే మిగిలిపోతున్నాయి. చిటికె వేయగానే ఇంట్లో పనులు, బటన్ నొక్కగానే డిఫరెంట్ వంటకాలు, ఊహించగానే నచ్చిన డ్రెస్​తో మేకప్ వంటి వింత కోర్కెలు తీర్చే గ్యాడ్జెట్లు కనిపెట్టి ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇవి గనుక కనిపెడితే ప్రతి ఒక్కరూ సూపర్ మ్యాన్​లా ఫీల్ అయిపోతారు కదా. మరి ఈ ఫిక్షనరీ గ్యాడ్జెట్లో మీకు ఏది కావాలో చూడండి.

ఫుడ్ మెషీన్: ఈ కాలంలో అంతా బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నారు. తినడానికే సమయం ఉండట్లేదు. ఇలాంటి సమయంలో ఓ చిటికె వేయగానే వేడివేడిగా బిర్యానీ, చికెన్, మటన్, చేపలు, పిజ్జాలు, చపాతీలు.. వంటి రెసిపీస్ రెడీ అయిపోయి వచ్చేస్తే ఎంత బాగుంటుందో కదా. కొన్ని రకాల కార్టూన్లలో అలా బటన్​ నొక్కగానే రకరకాల వంటకాలు రెడీ అయిపోయినట్లుగా మనకు కూడా ఓ మిషన్ పుట్టుకొస్తే ఎంత బాగుంటుందో. ఎంత ఖరీదైనా సరే ఈ మిషన్ కొనేందుకు అంతా ఆసక్తి చూపుతారు.

అవుట్‌ఫిట్ మ్యాచింగ్ సాఫ్ట్‌వేర్:యువత ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెసెస్​లో అందంగా రెడీ అవ్వాలని అనుకుంటారు. ఏ డ్రెస్​కు ఎలాంటి యాక్సెసరీస్, స్కర్ట్, ప్యాంట్, షూ నప్పుతాయో తెలియక కాస్త తికమక పడుతుంటారు. అలాంటి వారి కోసం డ్రెస్ గురించి సలహాలిచ్చే సాఫ్ట్‌వేర్ ఉంటే బాగుంటుంది కదా. ఏఐని ఉపయోగించి ఇప్పటికే ట్రెండింగ్ లుక్స్ సృష్టిస్తున్నారు. అలా కాకుండా మన దగ్గర ఉన్న దుస్తులనే ట్రెండీగా మార్చే అవుట్​ఫిట్​ మ్యాచింగ్ సాఫ్ట్‌వేర్ ఉంటే బాగుంటుంది.

స్మార్ట్ షూ: షూలో కాలు పెట్టగానే దానికదే లేసులు కట్టేసుకుంటే బాగుంటుంది కదా. దీంతోపాటు వాటికవే లేసులు ఊడదీసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడు మనం సూపర్ మ్యాన్​లాగా ఫీల్ అయిపోతాం. కొన్ని బ్రాండ్లు ఇప్పటికే స్మార్ట్ షూస్​ను రిలీజ్ చేసినా వాటి ధర మాత్రం చాలా ఎక్కువ.

హాలోగ్రాఫిక్ ఫ్యాషన్:ఆన్​లైన్, ఆఫ్​లైన్​ షాపింగ్​లో రకరకాలు డ్రెసెస్ చూస్తాం. దాన్ని ఎంతో ఇష్టపడి వేల రూపాయలు వెచ్చించి కొనుక్కుంటాం. అయితే తీరా కొనుక్కున్నాక అది మనకు అస్సలు సూట్​ అవ్వదు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చెయ్యకుండా హాలోగ్రాఫిక్ ఫ్యాషన్ టెక్నాలజీ వస్తే బాగుంటుంది కదా. మనం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోగానే ఫిట్టింగ్​తో సహా దాంట్లో మనం ఎలా ఉంటామో ఫొటో వచ్చేస్తుంది.

మెమోరీ ఎరేజర్:మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు నిరంతరం బాధను కలిగిస్తాయి. మనం మర్చిపోలేని మనుషులు, మనకు నచ్చని వ్యక్తులు, వాళ్లకు సంబంధించిన గుర్తులు మైండ్ నుంచి శాశ్వతంగా తుడిచేసే మెమోరీ ఎరేజర్ ఉంటే ఎలా ఉంటుంది? మనకు నచ్చని విషయాల్ని తుడిచేసుకుంటూ పోతే ఏ బాధలూ లేకుండా మనం ఆనందంగా ఉండొచ్చు కదా?.

టైమ్ మెషీన్:ఆదిత్య 360 మూవీలో చూపించినట్లుగా మనం కూడా చాలా కాలం ముందుకు వెళ్లిపోయి మన పూర్వీకులతో మాట్లాడగలిగితే బాగుంటుంది కదా? లేకుంటే భవిష్యుత్తు కాలంలోకి కూడా వెళ్లి వచ్చేస్తే ఎలా ఉంటుంది?. దీంతోపాటు మన గడిచిపోయిన వయసులో ఉన్న మన రూపంతోనే మనం మాట్లాడుకునే అవకాశం ఉంటే క్రేజీగా ఉంటుంది కదా?.

డబ్బిచ్చే చెట్లు:జీవితంలో అన్ని సమస్యలకు మనీ అవసరం లేకపోయినా కొన్నింటికి మాత్రం కచ్చితంగా ఉండాలి. అలాంటి సమయంలో డబ్బులు చెట్లకు కాస్తే భలే ఉంటుంది కదా. ఇలా అయితే ఏ పనీ చేయక్కర్లేదు. ఇంటి చుట్టూ ఈ చెట్లనే నాటుకుంటూ కూర్చుంటాం.

'రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350' లాంచ్- ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే! - Royal Enfield Classic 350 Launch

ఈ వర్షాకాలాన్ని మరింత ఎంజాయ్ చేయాలా?- వీటితో ఫుల్ మస్తీ! - Best Gadgets For Monsoon

ABOUT THE AUTHOR

...view details