తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బియ్యం పిండి దోశలతో షుగర్ సమస్యా? - ఇలా "రాగి దోశలు" చేసుకోండి! - సూపర్ టేస్టీ, ఇంకా ఆరోగ్యం

- నిమిషాల్లో సిద్ధమయ్యే మిల్లెట్ దోశ - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Instant Ragi Dosa
Ragi Dosa (ETV Bharat)

How to Make Instant Ragi Dosa : చాలా మంది ఇష్టపడే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలలో ఒకటి.. దోశ. అయితే, సాధారణంగా దోశలు తయారుచేసుకోవాలంటే ముందు రోజే రాత్రి పిండిని పులియబెట్టుకోవాలి. ఇదంతా కాస్త ప్రాసెస్​తో కూడుకున్న పని. కానీ, ఇప్పుడు చెప్పబోయే "రాగి దోశలకు" ఆ అవసరం లేదు. చాలా ఈజీగా నిమిషాల్లో వీటిని ఇన్​స్టంట్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిని తినడం ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియంలభిస్తుంది! టేస్ట్​ కూడా చాలా బాగుంటాయి. ఇంతకీ, ఈ సూపర్ హెల్దీ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • రాగిపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • ఎండుమిర్చి - 5
  • ఉల్లిపాయ - 1
  • సోంపు గింజలు - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - 1 టేబుల్​స్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా

బరువు, షుగర్​ను కొట్టే ఫుడ్​ ఇదే - "జొన్న దోశలు" ఇలా తయారు చేసుకోండి - టేస్ట్​ వేరే లెవల్​!

తయారీ విధానం :

  • ముందుగా సోంపు మిర్చి పౌడర్​ను ప్రిపేర్​ చేసుకోవాలి. ఇందుకోసం.. మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి, సోంపు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అలాగే.. రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నని తరుగులా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకును సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో.. రాగిపిండి, బియ్యప్పిండి, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, ఉప్పు, గ్రైండ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న ఎండుమిర్చి సోంపు పొడి.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నీ కలిసేలా కలుపుకుంటూ దోశ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. ఒక 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • 30 నిమిషాలయ్యాక.. స్టౌపై దోశ పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది హీట్ అయ్యాక గరిటెతో కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
  • అయితే.. ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకున్నాం కాబట్టి దోశలుచక్కటి షేప్​, పల్చగా రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • అందుకే.. వీలైనంత పల్చగా వేసుకొని అంచుల వెంబడి ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కాల్షియం రిచ్ "రాగి దోశలు" రెడీ!

పప్పు నానబెట్టేది లేదు, రుబ్బేది లేదు - క్షణాల్లో అద్దిరిపోయే దోశలు వేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details