Hyderabad To Uttarakhand IRCTC Tour : భక్తులందరికీ ఆధ్యాత్మిక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ఉంటుంది. ఇలాంటి వారి కోసం IRCTC టూరిజం ఎప్పటికప్పుడూ రకరకాల ప్యాకేజీలను అందుబాటులో తీసుకువస్తోంది. తాజాగా దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లను కవర్ చేస్తే అద్దిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకీ ఈ టూర్ ఎన్ని రోజులు? ఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ "దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర(Dev Bhoomi Uttarakhand Yatra)" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 10 రాత్రులు, 11 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్) నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. భారత్ గౌరవ్ మానస్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర ఉంటుంది.
ప్రయాణం ఇలా..
డే1..
మొదటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
డే2..
రెండవ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
డే3..
మూడవ రోజు మార్నింగ్ కత్గోడం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ రైలు దిగి భీమ్‌తాల్‌కు వెళ్తారు. హోటల్లో స్టే చేస్తారు. ఈవెనింగ్ భీమ్‌తాల్ సరస్సును చూస్తారు. నైట్ అదే హోటల్లో బస ఉంటుంది.
డే4..
మార్నింగ్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత నైనిటాల్ చూడడానికి వెళ్తారు. అక్కడ నైనాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ మీరు బోటింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి భీమ్‌తాల్‌కు తిరిగి వెళ్తారు. ఆ హోటల్లోనే స్టే చేస్తారు.
డే5..
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ నుంచి బయలు దేరతారు. అక్కడ నుంచి అల్మోరాకు వెళ్తారు. అల్మోరాలో హోటల్లో చెక్ఇన్ అవుతారు. కాసర్ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. నైట్ హోటల్లో స్టే చేస్తారు.
డే6..