Saree Draping Tips:భారతీయ మహిళలు అత్యధికంగా ధరించే వస్త్రాల్లో చీరది మొదటి స్థానం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా మెజారిటీ మహిళలు ప్రతిరోజూ చీరలనే ఎక్కువగా కట్టుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ల అసలైన అందం కనిపించేది చీరలోనే కదా! అయితే, ఆ బ్యూటీని మరింతగా మెరిపించేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ, మనం చీర కట్టే సమయంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల లుక్ మొత్తం పాడైపోతుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. అందంగా కనిపించేలా చీరలు కట్టాలంటే ఈ తప్పులు చేయకూడదని అంటున్నారు. మరి ఆ తప్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఫిజిక్‌ను ఆధారంగా:అన్నీ చీరలే కదా.. ఏదైనా ఒకటే కదాని.. అందరికీ సెట్ అవుతాయని అనుకోవద్దట. చీరల్ని మన బరువు, ఎత్తును బట్టి ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల చూడటానికి అందంగా కనిపిస్తారని పేర్కొంటున్నారు. అదే విధంగా, లోపల వేసుకునే పెట్టీకోట్స్, లంగాలు కూడా చీర రంగుకు మ్యాచింగ్‌లోనే ఉండాలట. దీని వల్ల చీర చూడటానికి అందంగా కనిపిస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా, పూర్తిగా వేరే రంగులోని వాటిని ఎంచుకుంటే చీరలు చూడటానికి అంత అందంగా కనిపించవని తెలుపుతున్నారు.
మ్యాచింగ్ లేని బ్లౌజ్:చాలా మంది ఆడవారు చేసే తప్పు మ్యాచింగ్ లేని జాకెట్ వేసుకోవడం. ఇందువల్ల చీర లుక్ మొత్తం మారిపోయి చూడటానికి బాగోదని చెప్పారు. అందుకే, కచ్చితంగా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం కాంట్రాస్ట్ బ్లౌజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి చీరలకు మ్యాచింగ్ లేకపోతే వీటిని ధరించమని చెబుతున్నారు. అలా అని ఏ కలర్ పడితే అది కాకుండా చీరకు సూట్ అయ్యే కాంట్రాస్ట్ బ్లౌజ్ యూజ్ చేయమని సలహా ఇస్తున్నారు.
సేఫ్టీ పిన్నులు:చాలా మంది చీరలు కట్టుకునే సమయంలో సేఫ్టీ పిన్స్ ఎక్కువగా వాడుతుంటారు. అయితే, వీటిని అవసరమైన సైజ్‌లో వీలైనన్ని తక్కువ పెట్టాలని చెబుతున్నారు. వీటిని ఎక్కువగా వాడితే చీరల నాణ్యత, అందం దెబ్బ తింటుందని వివరిస్తున్నారు.