How to Store Coriander Fresh for Long Time :దాదాపు చేసే ప్రతి వంటలోనూ కొద్దిగా కొత్తిమీర వేస్తుంటారు. కర్రీ, చట్నీ, పులుసు, సాంబార్, బిర్యానీ ఇలా ఏ రెసిపీలోకైనా కొత్తిమీర వేస్తేనే ఆ రుచి ఇంకాస్త బాగుంటుంది. అందుకే మార్కెట్‌కి వెళ్లినప్పుడు వారానికి సరిపడా కొత్తిమీర తెచ్చుకుంటుంటారు. ఫ్రెష్‌గా ఉంటదనుకుంటే.. రెండు రోజులకే కొత్తిమీర పూర్తిగా వాడిపోతుంది. ఇలా కాకుండా కొత్తిమీర వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ టిప్స్ ఏంటో మీరు చూసేయండి.
పేపర్ టవల్‌తో:మార్కెట్ నుంచి కొత్తిమీర తీసుకొచ్చిన తర్వాత వేర్లు కట్ చేయండి. ఇప్పుడు రెండుసార్లు శుభ్రంగా కడగండి. తర్వాత గాలికి ఆరబెట్టండి. ఇప్పుడు కొత్తిమీరను పేపర్ టవల్లో చుట్టండి. తర్వాత పేపర్లో చుట్టిన కొత్తిమీరను డబ్బాలో పెట్టి మూత పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది.
నీటి జాడీలో..ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడగండి. ఇప్పుడు నీటి జాడీలో కొత్తిమీర కాడలకు సరిపడా నీళ్లు పోయండి. తర్వాత కొత్తిమీరను జాడీలో పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆకులు ఫ్రెష్‌గా ఉండడానికి రెండురోజులకు ఒకసారి వాటర్ మార్చండి.
పసుపు నీళ్లు..కొత్తిమీర శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. ఫ్యాన్ గాలికి కొత్తిమీర ఆరబెట్టండి. ఇప్పుడు కొత్తమీరను పేపర్ టవల్లో చుట్టి, డబ్బాలో పెట్టండి. దీనిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కొత్తిమీర తాజాగా ఉంటుంది.