తెలంగాణ

telangana

సాలెపురుగులు గూళ్లు పెట్టి ఇంటిని అందవిహీనంగా మార్చాయా? - ఈ టిప్స్​ పాటిస్తే ఒక్కటీ ఉండదు! - How to Eliminate Spiders Naturally

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 3:42 PM IST

Spiders: సాలె పురుగులు ఇంటిని అందవిహీనంగా మార్చేస్తాయి. ఇవి మరీ పెరిగిపోతే ఇల్లు పాడుబడ్డ బంగ్లాలా మారిపోతాయి. మరి మీ ఇంట్లో కూడా సాలె పురుగులు ఉన్నాయా? అయితే ఈ టిప్స్​ పాటించి వాటిని ఈజీగా తరిమికొట్టొచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Eliminate Spiders Naturally
How to Eliminate Spiders Naturally (ETV Bharat)

How to Eliminate Spiders Naturally:సాలె పురుగులను మన ఇళ్లలోకి రానిస్తే మొత్తం ఇంటినే పురాతన బంగ్లాలా మార్చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ గూడు కట్టి ఇంటీరియర్‌ను కూడా చెడగొడతాయి. అందుకే వీటిని తరిమి కొట్టేందుకు చాలా మంది అనేక రకాల రసాయనాలను వాడుతుంటారు. అవి వాడడం వల్ల వచ్చే వాసన మనకు సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా కాకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే.. సాలె పురుగులు ఇంటిని వదిలి పోతాయని అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్లటి వెనిగర్:సాలె పురుగులు పోవడానికి ఓ కప్పు నీరు, ఒక తెల్లటి వెనిగర్ కలిపి ఇల్లంతా చల్లాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాలీళ్లు గూళ్లు కట్టే చోట తప్పక స్ప్రే చెయ్యాలని సూచించారు. వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ యాసిడ్ వాసనకు సాలె పురుగులు రావని తెలుపుతున్నారు.

నారింజ, కమల పండ్ల తొక్కలు
బత్తాయి, నారింజ పండ్ల తొక్కల వంటివి సాలె పురుగులపై అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు తెలిపారు. సాలీళ్లు ఉండే చోట ఈ తొక్కలతో రుద్దితే పురుగులు ఇంటి నుంచి వెళ్లిపోతాయని చెబుతున్నారు.

పొగాకు వాసన:పొగాకు వాసనను సాలె పురుగులు భరించలేవని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో సాలీళ్లు గూడు కట్టే చోట.. కొంత పొగాకును చల్లాలని తెలిపారు. అలా వద్దనుకుంటే పొగాకును కాసేపు నీటిలో ముంచి ఆ తర్వాత నీటిని చల్లినా కూడా సాలె పురుగులు పారిపోతాయని వివరిస్తున్నారు.

పుదీనా ఆకులు:ఒక సీసా నీటిలో పుదీనా ఆకుల పేస్ట్​ లేదా నూనె కలిపి సాలె పురుగులు ఉన్న ప్రాంతాల్లో చల్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సాలె పురుగుల బెడద తగ్గిపోతుందని చెబుతున్నారు.

నిమ్మరసం స్ప్రే చేయాలి:నిమ్మకాయ రసాన్ని ఇంట్లోని తలుపులు, కిటికీలు.. అన్ని మూలలపై స్ప్రే చెయ్యడం వల్ల పురుగులు వెళ్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

వెల్లుల్లి:వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి గోడలు, కిటికీలపై స్ప్రే చేయడం వల్ల సాలెపురుగులు పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి తీవ్రమైన వాసనను భరించలేవని వివరిస్తున్నారు.

ఇంటిని శుభ్రం చేయాలి:ఇంటిని శుభ్రం చేయడం వల్ల కూడా సాలె పురుగులు పారిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి బాల్కనీ లేదా మూలల్లో సాలె పురుగులు ఉంటాయి కాబట్టి అక్కడ క్లీన్​గా ఉంచాలని సూచిస్తున్నారు. ఫలితంగా సాలె పురుగులు నివసించవని వివరిస్తున్నారు.

ఇంట్లో పగుళ్లు మూయాలి:కిటికీలు, తలుపులు, ఇంటి గోడల పగుళ్లపైనే సాలె పురుగులు ఎక్కువగా గూళ్లు నిర్మించుకుంటుంటాయి. కాబట్టి వీటిని మూసివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సాలె పురుగుల బెడద తగ్గుతుందని వివరిస్తున్నారు.

హెయిర్ డై మచ్చలు పోవట్లేదా? ఈ సింపుల్ టిప్స్​తో చిటికెలో మాయం! - Hair Dye Stains Remove Tips

ఆంధ్రా "గోంగూర నువ్వుల పచ్చడి​" - ఈ ప్రిపరేషన్ స్టైలే కేక! - Gongura Nuvvula Pachadi

ABOUT THE AUTHOR

...view details