ETV Bharat / offbeat

నిమిషాల్లోనే సూపర్​ టేస్టీ "టమాటా దోశలు" -​ ఇలా చేస్తే ఔర్​ ఏక్​ ప్లేట్​ అనడం పక్కా! - TOMATO DOSA RECIPE

మినప్పిండి దోశలను మించిన టేస్ట్ - ఒక్కసారి తింటే వన్స్​మోర్ అనాల్సిందే!

Tomato Dosa Recipe
Easy Dosa Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 5:21 PM IST

Simple Tomato Dosa Recipe : ఎక్కువ మంది ఇష్టపడే బ్రేక్​ఫాస్ట్​ రెసిపీలలో ఒకటి దోశ. అయితే, నార్మల్​గా మనం రోజూ ఏ దోశ వేస్తాం? సాదా దోశ లేదంటే రవ్వ దోశ. ఇంకా కాస్త టైమ్ ఉంటే ఎగ్‌ దోశ. పైగా వీటిన్నింటికీ ముందే బోలెడు ప్రిపరేషన్‌ కావాలి. అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఐదే ఐదు నిమిషాల్లో ఇలా "టమాటా దోశలు" వేసుకోండి. తరచూ తినే మినప్పిండి దోశల కంటే ప్రత్యేకంగా ఉండి ఇంటిల్లిపాదికీ చాలా బాగా నచ్చేస్తుంది. ఒకటి తిన్నారంటే ఇంకా ఇంకా కావాలంటారు. అంత రుచికరంగా ఉంటాయి ఇవి. పైగా ఆరోగ్యానికీ మంచిది! మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశలకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • 1 కప్పు - ఉప్మారవ్వ
  • 1 కప్పు - టమాటా ముక్కలు
  • 1 కప్పు - బియ్యప్పిండి
  • అర కప్పు - శనగపిండి
  • రెండు కప్పులు - మజ్జిగ
  • రుచికి సరిపడా - ఉప్పు
  • చెంచా - కారం
  • 3 - పచ్చిమిర్చి
  • అర చెంచా - అల్లం ముద్ద
  • అర కప్పు - కొత్తిమీర తరుగు
  • అర చెంచా - మిరియాల పొడి
  • పావు చెంచా - ఇంగువ
  • అర చెంచా - జీలకర్ర పొడి

నూనె, పెరుగు, సోడా, పప్పులు లేకుండానే - కమ్మటి "స్పాంజ్​ దోశలు"!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే, కొత్తిమీరను సన్నగా తరుక్కొని సిద్ధంగా పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్మారవ్వ, బియ్యప్పిండి, ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం మజ్జిగ, పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంపి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం ఒక మిక్సింగ్ బౌల్​ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకొన్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆపై దానిలో మరికొద్దిగా మజ్జిగ, అల్లం ముద్ద, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇంగువ, ముందుగా తరుక్కొని పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
  • ఆపై అంచుల వెంబడి కాస్త నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే 'ఇన్​స్టంట్ టమాటా దోశలు' రెడీ!
  • ఆ తర్వాత వీటిని పల్లీ, టమాటా చట్నీలో అద్దుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. నచ్చితే మీరూ ఓసారి ఇలా టమాటా దోశలను ట్రై చేయండి.

హోటల్ స్టైల్ "క్రిస్పీ దోశలు" - ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.