How to Make Gongura Paneer Curry:గోంగూర పేరు చెబితే చాలు.. చాలా మందికి నోట్లో లాలాజలం ఊరుతుంటుంది. గోంగూరను అనేక రకాల వంటల్లో వాడుతుంటారు. దీంతో పచ్చడి నూరినా.. పప్పులో వేసినా.. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవే కాకుండా కొంతమంది ఈ గోంగూరను నాన్‌వెజ్‌తో మిక్స్ చేసి కుక్ చేస్తుంటారు. అయితే.. ఎక్కువగా వెజ్ తినేవారి కోసం గోంగూర పనీర్ చేస్తే అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ టెస్టీ గోంగూర పనీర్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
- 200 గ్రాముల పనీర్
- లేత గోంగూర పెద్ద కట్ట ఒకటి
- 3 పచ్చిమిరపకాయలు
- అర కప్పు టమాటా పేస్టు
- 1 ఉల్లిపాయ సన్నని తరుగు
- 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లులి పేస్ట్
- 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి
- 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి
- 2 టేబుల్ స్పూన్ కారం
- హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు
- రుచికి సరిపడా ఉప్పు
- 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
- పావు కప్పు నూనె
- 1 టేబుల్ స్పూన్ ఆవాలు
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర
- 2 ఎండు మిరపకాయలు
తయారీ విధానం..
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ కడాయిలో నూనె పోసుకోవాలి.
- నూనె వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించండి.
- ఆ తర్వాత ఓ ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేలా ఫ్రై చేయండి.
- ఎర్రగా వేగాక అందులో అల్లం వెల్లులి పేస్టు, ధనియాల పొడి, పసుపు , కారం, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఫ్రై చేయండి.
- ఇప్పుడు గోంగూర ఆకులను వేసి మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. (పచ్చళ్లకి ముదురు గోంగూర వాడితే మంచిది. కానీ ఈ కూరకి లేత గోంగూర అయితే మెత్తగా గుజ్జుగా ఉడుకుతుంది. )
- అనంతరం టమాటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయి, నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. (ఇలా నూనె సెపరేట్ అయ్యే వరకు చేస్తేనే గ్రేవీగా, టేస్టీగా ఉంటుంది)
- ఇప్పుడు సుమారు 200 మిల్లీ లీటర్ల నీళ్లు పోసి హై-ఫ్లేమ్‌లో మరగనివ్వండి.
- ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కూర దగ్గరపడే దాకా హై ఫ్లేమ్‌పైనే ఉడికించుకోవాలి.
- ఇప్పుడు పనీర్ ముక్కలు వేసి బాగా కలిపి.. లో-ఫ్లేమ్‌లో సుమారు 5 నిమిషాలు మగ్గించుకోవాలి. (వేడి నీళ్లలో సుమారు 10 నిమిషాలు ఉంచి కూరలో వేస్తే ఫ్లేవర్స్ బాగా పడతాయి)
- తర్వాత నూనె సెపరేట్ అయ్యాక స్టౌ ఆఫ్ చేసుకుంటే గోంగూర పనీర్ కర్రీ రెడీ!
అద్దిరిపోయే 'టమాటా నిల్వ పచ్చడి' - ఇలా చేస్తే సువాసనకే నోట్లో నీళ్లు ఊరుతాయి! - How to Make Tomato Nilava Pachadi
నోటికి ఏమీ రుచించకపోతే - ఈ "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" టేస్ట్ చేయండి - కచ్చితంగా ఫిదా అయిపోతారు! - Kodiguddu Vellulli Kaaram Recipe