Sabarimala BUS Accident : హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు కేరళలోని కొట్టాయం కనమల అట్టివలం వద్ద బుధవారం ప్రమాదానికి గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో సైదాబాద్‌కు చెందిన బస్సు డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడగా, మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొట్టాయం నుంచి శబరిమలకు వెళ్తుండగా పంబానదికి 15 కిలోమీటర్ల దూరంలోని ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడింది. పక్కన చెట్లు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ రాజు మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. రాజు హైదరాబాద్‌లోని సైదాబాద్ ఏకలవ్య నగర్లో నివాసం ఉంటున్నాడు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో భద్రపరిచారు. బస్సు ఘాట్ రోడ్డులోని మూల మలుపు వద్ద కిందకు దిగుతుండగా అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - త్రుటిలో తప్పిన పెను ప్రమాదం