తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పార్టీ స్పెషల్ : ఫుల్ టేస్టీ వెల్లుల్లి కోడి వేపుడు - తిని తీరాల్సిందే! - GARLIC CHICKEN FRY RECIPE

- రొటీన్ చికెన్​ ఫ్రైని మించిన రుచి - ఒక్కసారి తిన్నారంటే మళ్లీ కావాలంటారు!

Garlic Chicken Fry Recipe
Garlic Chicken Fry Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 1:47 PM IST

Garlic Chicken Fry Recipe: పార్టీలకు లేదా వీకెండ్స్​ లంచ్​కి చికెన్​తో ఏదైనా టేస్టీ రెసిపీ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే.. ఈ వెల్లులి కోడి వేపుడును ఓ సారి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుందంటే నమ్మాల్సిందే! ఈ పద్ధతిలో చేస్తే చికెన్ముక్క బయట కరకరలాడుతూనే లోపల మృదువుగా చాలా రుచిగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం.. వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు

  • 400 గ్రాముల బోన్లెస్ చికెన్
  • 8 పచ్చిమిరపకాయలు
  • 30 వెల్లుల్లి పాయలు
  • 2 రెబ్బల కరివేపాకు
  • ఒక ఉల్లిపాయ ముక్కలు (చిన్నది)
  • పావు టీ స్పూన్ పసుపు
  • ఒక టీ స్పూన్ గరం మసాలా
  • ఒక టీ స్పూన్ వేపిన ధనియాల పొడి
  • ఒక టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి
  • రుచికి సరిపడా ఉప్పు
  • 3 - 4 చుక్కల రెడ్ ఫుడ్ కలర్
  • అర టేబుల్ స్పూన్ వెనిగర్
  • 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్
  • ఫ్రైకి సరిపడా నూనె

టాసింగ్ కోసం:

  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
  • 2 పచ్చిమిరపకాయలు
  • ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి
  • 2 రెబ్బల కరివేపాకు
  • అర టీ స్పూన్ వెల్లులి పొడి/ చాట్ మసాలా
  • తయారీ విధానం..
  • ముందుగా చికెన్​ తీసుకుని శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాత ఇందులోనే వేయించిన దనియాల, జీలకర్ర, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, దంచుకున్న వెల్లులి ముద్ద, కాస్త వెనిగర్ వేసి బాగా రుద్ది ముక్కలకి మసాలాలు పట్టించాలి.
  • ఆ తర్వాత చికెన్ కలర్​ఫుల్​గా కనిపించేందుకు ఫుడ్ కలర్ వేసుకోవాలి.
  • అనంతరం ముక్కలు క్రిస్పీగా అవ్వడానికి కార్న్ ఫ్లోర్ వేసి కలిపి సుమారు గంటపాటు పక్కకుపెట్టుకోవాలి.
  • ఇప్పుడు వెల్లులి మసాలా ముద్ద కోసం పచ్చిమిర్చి, వెల్లుల్లి పాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో అయితే కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  • గంట తర్వాత స్టౌ ఆన్ చేసి నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఇప్పుడు మరిగే నూనెలో కొద్దిగా కొద్దిగా చికెన్ ముక్కలను వేసుకుని మీడియం మంట మీద ఎర్రగా వేయించుకోవాలి.
  • రంగు మారిన తర్వాత మంటను హై-ఫ్లేమ్​పైకి మార్చి క్రిస్పీగా బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో కడాయి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి అందులోనే జీడిపప్పు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి.
  • జీడి పప్పు రంగు మారిన తర్వాత వేయించుకున్న చికెన్ ముక్కలు, గార్లిక్ పౌడర్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. (వెల్లులి పొడి లేనివారు చాట్ మసాలాను చల్లుకోవచ్చు.)
  • అంతే అద్దిరిపోయే వెల్లుల్లి చికెన్ వేపుడు రెడీ!

పప్పు రుబ్బకుండా 5 నిమిషాల్లో నోరూరించే 'బ్రెడ్ ఊతప్పం' చేసుకోండిలా! - దోశను మించిన టేస్ట్!!

చూస్తేనే నోరూరిపోయే "మీల్​ మేకర్ మంచూరియా" - 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ABOUT THE AUTHOR

...view details