తెలంగాణ

telangana

By ETV Bharat Features Team

Published : 4 hours ago

ETV Bharat / offbeat

రక్తహీనత సమస్యా? - ఇలా బీట్​ రూట్ చపాతీ చేసేయండి - అద్దిరిపోయే రుచి, అదనపు ఆరోగ్యం - How to Prepare Beetroot Chapati

Beetroot Paratha Recipe : చపాతీ రోజూ ఒకేలా చేసుకుంటే బోర్ కొడుతుంది. అందుకే.. ఇలా డిఫరెంట్​గా బీట్​రూట్​ చపాతీ ట్రై చేయండి. అద్దిరిపోయే రుచితోపాటు అదనపు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. మరి, దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Prepare Beetroot Chapati
How to Prepare Beetroot Chapati (ETV Bharat)

How to Prepare Beetroot Chapati in Telugu : మనలో చాలా మందికి ముఖ్యంగా మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఐరన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే.. బలహీనపడి అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు పాలు, బీట్​రూట్ వంటివి తీసుకోవాలని వైద్యులు సైతం సలహా ఇస్తుంటారు. కానీ.. చాలా మంది బీట్​రూట్ తినడానికి ఇబ్బంది పడుతుంటారు. జ్యూస్ తాగడాన్ని కూడా ఇష్టపడరు. ఇలాంటివారికి చక్కటి ఆప్షన్ బీట్​రూట్ చపాతీ!

బీట్​రూట్ చపాతీ చేసుకోవడం వల్ల.. అదంటే ఇష్టంలేని వాళ్లు కూడా ఇష్టంగా తినేస్తారు. దీనిని తినడం వల్ల రుచితోపాటు.. అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం అవుతాయి. అంతేకాదు.. ఈ బీట్ రూట్ చపాతీని తయారు చేసుకోవడం పెద్దగా ఇబ్బంది కూడా కాదు. ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ బీట్​రూట్ చపాతీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు బీట్​రూట్ తురుము
  • కొద్దిగా కొత్తిమీర
  • ఒక కప్పు గోధుమ పిండి
  • రుచికి సరిపడా ఉప్పు
  • నూనె

తయారీ విధానం..

  • ముందుగా ఓ గిన్నెలో బీట్​రూట్ తురుము, ఉప్పు, కొత్తిమీర, గోధుమ పిండి వేసి కలపాలి. మీకు కారంగా కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, మిరియాల పొడి వేసుకోవచ్చు.
  • ఇప్పుడు అవసరమైన మేర కొద్దిగా నీటిని కలుపుతూ రొట్టెలకు సరిపోయేలా పిండిని కలుపుకోవాలి. పిండి కలిపే విధానంపైనే చపాతీ టేస్ట్ ఆధారపడుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి.
  • అనంతరం వీటిని రొట్టెలు చేసుకునేందుకు వీలుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. అంటే.. చపాతీ ముద్దల మాదిరిగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత పీటను తీసుకుని దానిపై కాస్త పొడి పిండిని చల్లుకుని పిండి ముద్దలను రొట్టెలాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పెనంపై రొట్టెను వేసి దానిపై నూనె వేసి కాల్చాలి.
  • ఇలా రెండు వైపులా నూనెను వేస్తూ బాగా కాల్చుకోవాలి.
  • అంతే.. ఎంతో హెల్దీ బీట్​రూట్ చపాతీ రెడీ అయిపోతుంది.
  • ఇది సాధారణ చపాతీకన్నా ఎంతో మేలైనది. చపాతీలో కేవలం గోధుమ పిండి బెనిఫిట్స్ మాత్రమే లభిస్తాయి. కానీ.. బీట్​ రూట్​ చపాతీలో పుష్కలంగా ఐరన్ కూడా లభిస్తుంది.
  • సో.. మీకు నచ్చితే ఈ రోజే తయారు చేసేయండి.

రొటీన్​ కూరలు తిని నోరు చప్పగా తయారైందా? - ఇలా "పచ్చిమిర్చి బండ పచ్చడి" ట్రై చేయండి - చాలా టేస్టీ! - Pachimirchi Roti Pachadi

మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ తయారీకి టైమ్​ లేదా? - ఈ "ఇన్​స్టంట్ దోశ"ను ట్రై చేయండి - 5 నిమిషాల్లోనే రెడీ! - Instant Dosa Recipe

ABOUT THE AUTHOR

...view details