Ten Crore Rupees Flat in Central Hyderabad : హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తున్నా సెంట్రల్ హైదరాబాద్‌కు ఉన్న డిమాండ్ చెక్కుచెదరడం లేదు. నవంబర్ 2024లో జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో అత్యధిక ఖరీదు కలిగిన ఆవాసాలు బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ విల్లాల ఖరీదు అయితే రూ. పదుల కోట్లలోనే ఉంటుంది. తాజాగా అపార్ట్మెంట్లోని ప్లాట్ల ధరకు వీటితో పోటీపడుతున్నాయి. అత్యధిక ధర కలిగిన ఐదు ఫ్లాట్లు కూడా మూడు వేలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన స్థిరాస్తులే. సోమాజిగూడలో 10.22 కోట్ల రూపాయలకు ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగింది. బంజారాహిల్స్‌లో 2 లావాదేవీలు ఒక్కోటి రూ.7.47 కోట్లు నమోదు కాగా జూబ్లీహిల్స్‌లో మరో ఫ్లాట్ రూ.7.04 కోట్ల విలువతో రిజిస్ట్రేషన్ అయింది.
మూడు జిల్లాల్లో ఇలా
హైదరాబాద్‌లో విక్రయాలు అయితే మందకొడిగా ఉన్నా చదరపు అడుగు సగటు ధరల్లో మాత్రం పెరుగుదల నమోదైనట్లు ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది.
- హైదరాబాద్‌లో సగటు చదరపు అడుగు ధర 4,966 రూపాయలు ఉంది. 2023 నవంబర్‌తో పోలిస్తే 10 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం నగర రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉంది.
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ.3 వేల 563గా ఉంది. నిజానికి వాస్తవ ధర ఎక్కువగానే ఉంది. రిజిస్ట్రేషన్ విలువనే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకు ఇక్కడ తక్కువగా కనిపిస్తోంది. ఇందులో పెరుగుదల 11 శాతంగా ఉండగా మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ జిల్లా వాటా 42 శాతంతో మొదటి స్థానంలో ఉంది.
- రంగారెడ్డి జిల్లాలో సగటు చదరపు అడుగు ధర రూ.4,213గా నమోదైంది. ఇందులో ధరలు 6 శాతం వృద్ధి చెందగా రిజిస్ట్రేషన్లలో జిల్లాల వాటా 41 శాతంతో రెండో స్థానంలో ఉంది.
వీటిలో అత్యధికం
- మూడు జిల్లాల్లో కలిపి రిజిస్ట్రేషన్ విలువ సుమారు 50 లక్షల రూపాయలలోపు ఉన్న వాటి వాటా 58 శాతంగా ఉంది. 2023తో పోలిస్తే 3 శాతం తగ్గాయి.
- అర కోటి నుంచి కోటి రూపాయల మధ్య విలువ కలిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల వాటా 28 శాతంగా ఉంది. 2023తో పోలిస్తే ఒక శాతం పెరిగింది.
- కోటి రూపాయలపైనే ధర పలికే ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2023తో పోలిస్తే 2 శాతం పెరిగాయి. అయితే 2023లో రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 12 శాతం ఉంటే 2024కి 14 శాతానికి పెరిగింది.
'హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ వద్ద గజం రూ.1800 మాత్రమే!'
ఇల్లు కొనాలనుకుంటున్నారా? - వెంటనే త్వరపడండి - ఇలాంటి ఆఫర్ మళ్లీ దొరకదు!