తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

హోటల్లో దొరికే సూపర్ టేస్టీ సాంబార్.. ఇప్పుడు మీ ఇంట్లోనే! - ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఘుమఘుమలాడిపోద్ది

- ఏ టిఫిన్​లోకైనా ఈ సాంబార్ సూపర్​ కాంబో - తయారు చేయడం ఇప్పుడు చాలా ఈజీ

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Andhra Style Tiffin Sambar
Andhra Style Tiffin Sambar (ETV Bharat)

Andhra Style Tiffin Sambar:ఇడ్లీ, మైసూర్ బోండా, వడ ఇలా హోటల్లో.. ఏది తినాలన్నా చాలా మందికి చట్నీతోపాటుగా సాంబార్ తప్పకుండా ఉండాల్సిందే! అది లేకుండా టిఫిన్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అయితే.. ఇదే టేస్ట్ ఇంట్లో చూద్దామంటే సాంబార్ అంత టేస్ట్​గా కుదరదు. అందుకే.. ఈ రెసిపీ తీసుకొచ్చాం. పక్కా కొలతలతో ఆంధ్ర స్టైల్​లో సాంబార్ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేకమైన సాంబార్ ఎలా చేయాలి? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • ఒక కప్పు కంది పప్పు
  • అర కప్పు పెసర పప్పు
  • మూడు టేబుల్ స్పూన్ల నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • రెండు రెబ్బల కరివేపాకు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • రెండు ఎండు మిర్చి
  • 6 దంచిన వెల్లుల్లి రెబ్బలు
  • 4 పచ్చిమిరపకాయలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • అర టీ స్పూన్ పసుపు
  • ఒక ఉల్లిపాయ ముక్కలు
  • అర కప్పు మునగకాయ ముక్కలు
  • ఒక క్యారెట్ (ముక్కలుగా చేసుకోవాలి)
  • ఒక టమాటా (ముక్కలుగా చేసుకోవాలి)
  • ఒక టేబుల్ స్పూన్ కారం
  • ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • పావు కప్పు చిక్కటి చింతపండు రసం
  • కొద్దిగా కొత్తిమీర
  • పావు చెంచా ఇంగువా
  • ఒక టేబుల్ స్పూన్ నెయ్యి

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో కంది పప్పు, పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి సుమారు గంటపాటు నానబెట్టాలి.
  • ఆ తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్​లో వేసి మూడున్నర కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్​లో ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. అనంతరం మూత తీసి రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేగనివ్వాలి.
  • ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
  • ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించుకోవాలి.
  • అనంతరం మునగకాయ, క్యారెట్, టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి.
  • ఆ తర్వాత కారం, ధనియాల పొడి, అర లీటర్ నీళ్లు పోసి 4 నిమిషాల పాటు మరగనివ్వాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నానబెట్టుకున్న పప్పులో వేసి ఉప్పు కలిపి 15 నిమిషాల పాటు లో-ఫ్లేమ్​లో మరగనివ్వాలి. (మీకు అవసరమైతే నీళ్లను కలుపుకోవచ్చు)
  • సాంబార్ పొంగుతున్న సమయంలో చింతపండు రసం, కొత్తిమీర తరుగు, ఇంగువా వేసుకుని మరో 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత నెయ్యి వేసుకుని దించేసుకుంటే టేస్టీ ఆంధ్ర స్టైల్ టిఫిన్ సాంబార్ రెడీ!

వంకాయ పచ్చి కారం - రొటీన్​గా కాకుండా వెరైటీగా చేసుకోండిలా!

అసలు సిసలైన ఆంధ్రా స్టైల్​ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

ABOUT THE AUTHOR

...view details