తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇంట్లో కెమికల్ ఫ్రెష్​నర్స్​ ఎందుకు? - ఈ సహజ పరిమళాలు వెదజల్లండి! - ఆరోగ్యం, ఆనందం మీ సొంతం - NATURAL WAYS TO IMPROVE HOME SMELL

ఇంట్లో దుర్వాసన పోగొట్టడానికి చాలా మంది రూమ్ ఫ్రెష్​నర్స్ వాడుతుంటారు. వీటివల్ల అనారోగ్యం కలుగుతుందనే ఆందోళన కూడా ఉంటుంది. అందుకే.. సహజ పద్ధతిలో పరిమళాలు వెదజల్లడానికి ఇలా చేయండి.

Natural Ways to Improve Home Smell
Natural Ways to Improve Home Smell (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 5:32 PM IST

Natural Ways to Improve Home Smell: వివిధ కారణాల వల్ల ఇంట్లో ఒక్కోసారి దుర్వాసన వస్తుంటుంది. ఈ దుర్వాసన పోగొట్టేందుకు చాలా మంది పరిమళాలు వెదజల్లే ఎయిర్‌ డిఫ్యూజర్లు, రూమ్‌ ఫ్రెష్‌నర్లు వాడుతుంటారు. వీటివల్ల వచ్చే సువాసనల విషయం పక్కన పెడితే.. వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఘాటైన వాసనల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో సహజసిద్ధమైన పరిమళాలు వెదజల్లేందుకు పలు చిట్కాలు పాటించాలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుకుందాం.

ఆయిల్‌ బర్నర్స్

ఆయిల్‌ బర్నర్స్ (ETV Bharat)
మనలో చాలా మంది ఇంట్లోని దుర్వాసనల్ని దూరం చేసి పరిమళాలు నింపేందుకు అత్యవసర నూనెల్ని ఉపయోగిస్తుంటారు. అయితే వీటిలో గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవిరి రూపంలో ఉపయోగించడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారి కోసమే వివిధ డిజైన్లలో రూపొందించిన ఆయిల్‌ బర్నర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో దొరకుతున్నాయి. దీనికి కింది భాగంలో ఉండే చిన్న రంధ్రంలో క్యాండిల్‌/దీపం అమర్చుకునేలా ఉంటుంది. ఇక పైభాగంలో ఒక గిన్నె లాంటిది అమర్చి ఉంటుంది. అందులో నీళ్లు, కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె వేయాలట. ఇప్పుడు కింది నుంచి దీపం వెలుగుతున్న కొద్దీ ఆ వేడికి నూనె మిశ్రమం వేడెక్కి క్రమంగా ఆవిరవుతుంటుందని చెబుతున్నారు. ఫలితంగా ఇంట్లో పరిమళాలు వెదజల్లుతాయని అంటున్నారు. ఇలా గిన్నెలో మిశ్రమం అడుగంటిన కొద్దీ తిరిగి నింపుతుండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో ఇలాంటి ఆయిల్‌ బర్నర్స్‌లో కరెంట్‌తో పని చేసేవి కూడా దొరుకుతున్నాయి. వీటిని ప్రతి గదిలోనూ పెట్టుకుంటే ఇంటిని పరిమళభరితం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
అత్యవసర నూనెతో చేసిన స్ప్రే (ETV Bharat)

అత్యవసర నూనెలతో ఇలా!
ఇలా కేవలం ఆయిల్‌ బర్నర్స్‌తోనే కాకుండా ఇతర పద్ధతుల్లోనూ అత్యవసర నూనెలతో ఇంట్లో సువాసనలు వెదజల్లవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఓ బాటిల్‌లో నీరు నింపి కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనెను వేయాలట. ఆ తర్వాత దానిని షేక్‌ చేసి.. ఓ స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. దీనిని ఇంట్లో దుర్వాసనలు ఉన్న చోట లేదంటే ఇల్లంతా స్ప్రే చేసుకోవాలి. ఇక తేమ కారణంగా అల్మరాల్లో నుంచి దుర్వాసన వస్తుంటే కాటన్‌ బాల్స్‌పై కొన్ని చుక్కల అత్యవసర నూనె వేసి పెడితే ఫలితం ఉంటుందన్నారు. లేకపోతే స్ప్రే బాటిల్‌తో స్ప్రే చేసి.. వాటిని అల్మరా/కప్‌బోర్డ్‌ మూలల్లో ఉంచితే పరిమళాలు వెదజల్లుతాయని వివరించారు.

డిఫ్యూజర్‌ స్టిక్స్‌ (ETV Bharat)

అగర్‌బత్తీలకు బదులు..!
ఇంట్లో దుర్వాసనలు వస్తుంటే చాలు.. వెంటనే అగర్‌బత్తీలు వెలిగిస్తుంటాం. వాస్తవానికి వీటి నుంచి సువాసనలు వచ్చినా.. వాటి తయారీలో వాడిన కొన్ని రసాయన పదార్థాలు వాతావరణంలోకి చేరి కొందరిలో కళ్ల మంట, చర్మంపై దురద వచ్చేలా చేస్తుంటాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా, సహజసిద్ధంగా తయారైన డిఫ్యూజర్‌ స్టిక్స్‌ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. తాటిచెట్టు బెరడు, వెదురు, చార్‌కోల్‌.. వంటి సహజసిద్ధమైన పదార్థాలు.. మూలికలు, పువ్వుల నుంచి తీసిన నూనెను జతచేసి వీటిని తయారుచేస్తుంటారు. అగర్‌బత్తీ స్టిక్స్‌ను పోలి ఉండే వీటిని వెలిగించడం వల్ల గదిలో పరిమళాలు వెదజల్లడమే కాకుండా.. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యా ఉండదని వివరించారు.

సెంటెడ్‌ క్యాండిల్స్ (ETV Bharat)

సెంటెడ్‌ క్యాండిల్స్
సెంటెడ్‌ క్యాండిల్స్.. ఇంట్లో దుర్వాసనలను పోగొట్టడమే కాకుండా ఒత్తిడిని తరిమికొట్టి మానసిక ప్రశాంతతను అందిస్తాయని చెబుతున్నారు. అందుకే చాలామంది వీటిని వెలిగించుకుంటుంటారు. అయితే.. వీటిలోనూ సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన క్యాండిల్స్‌ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలోనూ విభిన్న డిజైన్లలో రూపొందించినవి ఎంచుకుంటే.. ఇటు ఇంట్లో పరిమళాలతో పాటు.. అటు ఇంటిని ఆకర్షణీయంగానూ మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవే కాకుండా పరిమళాలు వెదజల్లే పూల మొక్కలు, ఇండోర్‌ ప్లాంట్స్‌ను ఇంట్లో అక్కడక్కడా పెంచుకోవడం వల్ల సువాసనలు వెదజల్లుతాయని సలహా ఇస్తున్నారు.

మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్​ రంగు పోతోందా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుపు తగ్గదు! - Washing Clothes Tips and Tricks

కాటన్ బాల్స్ కేవలం బ్యూటీకే కాదు- ఇలా కూడా వాడొచ్చు! మీకు తెలుసా? - Cotton Balls Uses for Homemade

ABOUT THE AUTHOR

...view details