తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఎగ్ లేకుండా ప్యూర్ "వెజ్ బుర్జీ" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ కేక​! - Veg Bhurji Recipe - VEG BHURJI RECIPE

Veg Bhurji Recipe : ఎగ్​ బుర్జీ అంటే అందరికీ తెలుసు. చాలా ఇష్టం కూడా. మరి.. మీకు వెజ్ బుర్జీ తెలుసా? చపాతీ, రైస్​ ఇలా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్​గా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Veg Bhurji Recipe
Veg Bhurji Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 1:47 PM IST

How to Make Veg Bhurji Recipe :మెజార్టీ పీపుల్​కు ఎగ్​ బుర్జీ ప్రిపేర్ చేసుకోవడం తెలుసు.. కానీ, గుడ్డు(Egg) లేకుండా కూడా బుర్జీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అది కూడా 100 శాతం ప్యూర్ వెజ్​తో అద్దిరిపోయే టేస్ట్​తో రెడీ చేసుకోవచ్చు! పులావ్, చపాతీ, రోటీ, అన్నం ఇలా ఎందులోకైనా ఈ బుర్జీ టేస్ట్​ అద్దిరిపోతుంది. పైగా ఈ రెసిపీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు! చాలా సులభం​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, వెజ్ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వెజ్​ బుర్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి- కప్పు
  • బియ్యం పిండి- పావు కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నూనె
  • కరివేపాకు-2 రెమ్మలు
  • ఉల్లిపాయ-1 (సన్నగా కట్​ చేసుకోవాలి)
  • జీలకర్ర- అరటీస్పూన్​
  • అల్లం తురుము- టీస్పూన్
  • పచ్చిమిర్చి-3
  • టమాటాలు-2
  • కారం-టీస్పూన్​
  • ధనియాలపొడి- టీస్పూన్​
  • గరం మసాలా -అరటీస్పూన్​
  • మిరియాలపొడి-పావు టీస్పూన్​
  • కొత్తిమీర
  • నిమ్మరసం

తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలో శనగ పిండి, బియ్యం పిండి వేసి కలపండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నీళ్లను పోసుకుంటూ.. దోశల పిండి కంటే కాస్త జారుగా కలుపుకోండి. దీనిని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేయండి. ఇందులో జీలకర్ర, అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపండి. తర్వాత టమాటా ముక్కలు, కారం, ధనియాలపొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపండి.
  • టమాటాలు ఉడికిన తర్వాత ప్రిపేర్​ చేసుకున్న శనగపిండి మిశ్రమం పోసుకోండి. గిన్నె అంచుల వెంట, పైన కొద్దిగా ఆయిల్​ వేసి మూత పెట్టి.. సన్నని మంట మీద శనగ పిండి ఉడికించుకోండి.
  • ఐదు నిమిషాల తర్వాత పిండిపైన గరిటెతో అక్కడక్కడా చిన్న హోల్స్​ చేసుకోండి. ఇలా చేస్తే పిండి లోపల కూడా చాలా చక్కగా కుక్​ అవుతుంది.
  • శనగపిండి ఉడికిన తర్వాత పిండిని చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు మంట కాస్త పెంచి పిండిలో చెమ్మ ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • స్టౌ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని దింపేసుకుంటే సరిపోతుంది.
  • అంతే.. ఎంతో టేస్టీగా ఉండే వెజ్​ బుర్జీ మీ ముందుంటుంది. నచ్చితే.. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినేస్తారు.

ABOUT THE AUTHOR

...view details