తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నూనె, పెరుగు, సోడా, పప్పులు లేకుండానే - కమ్మటి "స్పాంజ్​ దోశలు"!

- టమాటా చట్నీతో ఆరగిస్తే అదుర్స్​!

Sponge Dosa Recipe
How to Make Sponge Dosa Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

How to Make Sponge Dosa Recipe :చాలా మందికి మృదువుగా, కమ్మగా ఉండే దోశలంటే ఎంతో ఇష్టం. కొంతమంది మెత్తటిదోశలు తినడానికే హోటల్స్​కి వెళుతుంటారు. అయితే, కొన్ని టిప్స్​ పాటిస్తూ చేస్తే ఇంట్లోనే స్పాంజ్​ దోశలను ప్రిపేర్​ చేసుకోవచ్చు. పైగా ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే.. నూనె, పప్పులు, సోడా, పెరుగు వంటివి ఏవీ అవసరం ఉండవు. బ్రేక్​ఫాస్ట్​లో పిల్లలు మెత్తటి దోశలనుఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా స్పాంజ్​ దోశలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

స్పాంజ్ దోశకి కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం-ఒకటిన్నర కప్పు
  • ఒక స్పూను - మెంతులు
  • మరమరాలు-3 కప్పులు
  • ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా బియ్యం, మెంతులను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై వాటర్ పోసి 5 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు యాడ్​ చేసుకుంటూ మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి. పిండి మిశ్రమాన్ని పెద్ద గిన్నెలో పోసుకోవాలి.
  • ఇప్పుడు మరో బౌల్​లో మరమరాలను నీటిలో వేసుకుని కాసేపు నానబెట్టుకోండి. ఆపై వాటిలోని నీటిని పిండేసి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొన్ని నీళ్లు యాడ్​ చేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • మరమరాల పేస్ట్​ని బియ్యం పిండిలో వేసుకుని చేతితో బాగా కలపండి. తర్వాత గిన్నెపై మూత పెట్టి 8 గంటల పాటు పులియబెట్టాలి.
  • దోశలు వేసుకునే ముందు పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. (పిండి మరీ చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవచ్చు)
  • తర్వాత స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకొని మందపాటి దోశలా వేసుకోవాలి.
  • సెట్​ దోశ టైప్​ మాదిరిగా వేసుకున్నాక దానిపై మూతపెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత దోశను గరిటెతో మరోవైపు తిప్పి కాసేపు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా మిగిలిన పిండితో​ దోశలు చేసుకుంటే సరిపోతుంది. ఎంతో మృదువైన దోశలు మీ ముందుంటాయి.
  • ఈ దోశల్ని కొబ్బరి చట్నీ/పల్లీల చట్నీ, టమాటా చట్నీతో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
  • నచ్చితే ఇలా దోశలను ఇంట్లో ట్రై చేయండి.

టేస్టీ టమాటా చట్నీకి కావాల్సి పదార్థాలు :

  • ఆయిల్
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • ఉప్పు - రుచికి సరిపడా
  • టమాటాలు - 3 సన్నగా కట్ చేసి వేయాలి
  • చింతపండు - చిన్న సైజు నిమ్మకాయంత
  • ఎండు మిరపకాయలు - ఆరు నుంచి ఏడు
  • ఆవాలు-టీస్పూన్
  • మినప్పప్పు-ఆఫ్ స్పూన్
  • కరివేపాకు
  • ఒక ఎండు మిర్చి

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయండి.
  • ఆపై కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి రంగు మారే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చిలు వేసి ఫ్రై చేయండి.
  • తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించండి.
  • టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు వేసి కాసేపు ఫ్రై చేయండి
  • ఆపై స్టౌ ఆఫ్​ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​లో టమాటా మిశ్రమం వేసుకోవాలి. అందులోని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత స్టౌమీద పాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి
  • ఆయిల్​ వేడెక్కిన తర్వాత ఆఫ్ టీస్పూన్ ఆవాలు, ఆఫ్ స్పూన్ మినప్పప్పు వేయాలి.
  • తర్వాత కరివేపాకు, ఒక ఎండు మిర్చి వేసి వేపాలి.
  • పోపు రెడీ అయిన తర్వాత ఇందులో.. మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం వేయాలి.
  • నిమిషం పాటు అటూ ఇటూ కలిపిన తర్వాత చక్కని, చిక్కని టమాటా చట్నీ తయారవుతుంది.
  • ఈ టమాటా చట్నీతో వేడివేడి స్పాంజ్​ దోశలు తింటే టేస్ట్​ అద్బుతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

చలికాలం ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులియాలంటే - పప్పు నానబెట్టేటప్పుడు వీటిని ఒక స్పూన్ కలిపితే చాలట!

సూపర్ టేస్టీ "సగ్గుబియ్యం దోశలు" - నిమిషాల్లో చేసుకోండిలా! - అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది!

ABOUT THE AUTHOR

...view details