ETV Bharat / offbeat

లంచ్​ బాక్స్ స్పెషల్​ కమ్మటి "ఉసిరికాయ అన్నం" - 10 నిమిషాల్లోనే సిద్ధం చేయండిలా! - HOW TO MAKE AMLA RICE RECIPE

- పిల్లలు ఇష్టంగా తినే ఆమ్లా రైస్​ - ఇలా చేస్తే రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

Amla Rice Recipe
Amla Rice Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 1:31 PM IST

Amla Rice Recipe in Telugu : ఆరోగ్యానికి మేలు చేసే ఉసిరికాయలతో మనలో చాలా మంది నిల్వ పచ్చళ్లు తయారు చేస్తుంటారు. అలాగే పప్పు వండుకుని తృప్తిగా భోజనం ఆరగిస్తుంటారు. అయితే, ఉసిరికాయలతో అప్పటికప్పుడు నిమిషాల్లోనే కమ్మగా రైస్​ కూడా చేసుకోవచ్చు. పుల్లపుల్లగా ఉండే ఉసిరికాయ అన్నం పిల్లల కోసం లంచ్​ బాక్స్​లో పెడితే మెతుకు మిగల్చకుండా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చేయడానికి ఎక్కువ టైమ్ పట్టదు.. నిమిషాల్లోనే ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి సింపుల్​గా కమ్మగా ఉసిరికాయ అన్నం ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - కప్పు
  • నువ్వులు- 2 టీ స్పూన్లు
  • మిరియాలు- అర టీస్పూన్​
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఉసిరికాయలు - 5
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నువ్వుల నూనె - రెండున్నర టేబుల్​ స్పూన్లు
  • పల్లీలు- 3 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • మినప్పప్పు- 1 టీస్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్​
  • జీలకర్ర- 1 టీ స్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు- రెండు రెబ్బలు
  • ఇంగువ- చిటికెడు
  • సాంబార్​ పొడి - అర టేబుల్​ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా బియ్యాన్ని రెండుమూడు సార్లు శుభ్రంగా నీటిలో కడగాలి. ఆ తర్వాత ఉసిరికాయలను శుభ్రం చేసి.. తురిమి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కుక్కర్​ తీసుకుని అందులోకి కడిగిన బియ్యం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి రెండు కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టాలి. స్టౌ హై ఫ్లేమ్​లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ఆపై స్టౌ​ ఆఫ్​ చేసి స్టీమ్​ పోయిన తర్వాత మూత తీసి అన్నాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ​ ఆన్​ చేసి పాన్​ పెట్టుకోవాలి. ఇందులో మిరియాలు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కొద్దిగా బరకగా గ్రైండ్​ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టి 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ పోసి వేడి చేయండి.
  • నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, మినప్పప్పు, పచ్చి శనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్​ మీద ఎర్రగా ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • అలాగే ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్​ పొడి వేసి కేవలం 30 సెకన్ల పాటు వేపి స్టౌ​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోకి గ్రైండ్​ చేసుకున్న నువ్వులు, మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి.
  • అలాగే తురుముకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. (ఈ ప్రాసెస్​ అంత స్టౌ​ ఆఫ్​ చేసే చేయాలి.)
  • ఇప్పుడు తాలింపును అన్నంలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • (ఒకవేళ అన్నంలో పులుపు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే మరికొంచెం ఉసిరి తురుము కలుపుకోవచ్చు.)
  • అంతే ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ రైస్​ రెడీ.

ఇవి కూడా చదవండి:

అదరహో అనిపించే "అన్నవరం ప్రసాదం" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! - టేస్ట్​ అద్భుతం!

ఆహా అనిపించే "క్యాబేజీ బూందీ ఫ్రై" - ఇలా చేస్తే వద్దన్నవారే లొట్టలేసుకుంటూ తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.