తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "పాలకూర వేపుడు" - ఇలా ట్రై చేస్తే సూపర్ టేస్ట్​​!

- రొటీన్​కు భిన్నంగా అద్దిరిపోతుంది

Palakura Fry
How to Make Palakura Fry (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

How to Make Palakura Fry :ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే వీటిని తరచూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఆకుకూరల్లో అద్భుతమైనది, జనాలు ఎక్కువగా ఉపయోగించే వాటిలో పాలకూర ఒకటి. అయితే.. కొద్దిమంది దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు.

ఇక పాలకూర తినేవాళ్లు కూడా.. నిత్యం పప్పు, పాలకూర వెల్లుల్లి కారం చేసుకుని తింటుంటారు. ఫర్​ ఏ ఛేంజ్.. ఇప్పుడు మనం టేస్టీగా పాలకూర వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా పాలకూర ఫ్రై చేస్తే.. రుచి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ముఖం చిట్లించకుండా ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ కమ్మని పాలకూర ఫ్రై ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర- 5 కట్టలు
  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర-అరటీస్పూన్
  • ఆవాలు-అరటీస్పూన్
  • మినప్పప్పు-కొద్దిగా
  • శనగపప్పు-కొద్దిగా
  • కరివేపాకు-1
  • ఎండుమిర్చి-3
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు-పావు టీస్పూన్​

స్పెషల్​ పొడి కోసం..

  • ధనియాలు-2 టేబుల్​స్పూన్లు
  • ఎండుమిర్చి-8
  • జీలకర్ర-అరటీస్పూన్
  • మెంతులు-పావు టీస్పూన్​
  • కరివేపాకు-2
  • వెల్లుల్లి రెబ్బలు-10

తయారీ విధానం :

  • ముందుగా పాలకూరను నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుక్కోవాలి. పాలకూర కాడలు సన్నగా ఉంటే కట్​ చేయండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి.
  • తాలింపు దోరగా వేగిన తర్వాత కట్​ చేసిన పాలకూర తరుగు వేసుకోండి. ఆపై రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోండి.
  • ఇప్పుడు పాలకూరలో వాటర్​ ఊరుతుంది. ఆ వాటర్​ పూర్తిగా పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి.
  • ఈ టైమ్​లో స్పెషల్​ పొడి చేయడం కోసం మరో స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి మసాలాలు దోరగా ఫ్రై చేసుకోండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేసుకోండి.
  • ఇప్పుడు స్పెషల్​ పొడిని.. ఫ్రై చేసుకున్న పాలకూరలోవేసి మిక్స్​ చేయండి.
  • ఒక నిమిషం వేయించిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా చేస్తే కమ్మని పాలకూర వేపుడు మీ ముందుంటుంది.
  • ఈ పాలకూర వేపుడు వేడివేడి అన్నంలోకి రుచి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఈ విధంగా పాలకూర ఫ్రై ఇంట్లో ట్రై చేయండి.

ఆరోగ్యాన్నిచ్చే టేస్టీ "పాలక్ సోయా బుర్జీ" - సింపుల్​గా ఇలా ప్రిపేర్​ చేసుకోండి! - టేస్ట్ కేక!

ధాబా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే, పాలకూరే కావాలంటారు!

Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details