తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

స్వీట్​ లవర్స్​ ఫేవరెట్​ - వందల ఏళ్ల నాటి "పాల పూరీలు" - ఇలా చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

-రెగ్యూలర్​ పూరీలను మించిన టేస్ట్​ - స్వీట్స్​ ఇష్టపడేవారు ఎంతోగానే ఎంజాయ్​ చేస్తారు

How to Make Pala Puri At Home
How to Make Pala Puri At Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

How to Make Pala Puri At Home: పూరీలు అంటే అందరికీ టిఫెన్​లో తినేవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ అందులో కూడా చాలా రకాలే ఉంటాయి. అలాంటి వాటిలో పాల పూరీలు కూడా ఒకటి. పాకం పూరీలు తెలుసు.. ఈ పాల పూరీలు ఏమిటీ అనుకుంటున్నారా? ఒకప్పుడు స్వీట్​ తినాలనిపించినప్పుడల్లా వీటిని చేసుకుని తినేవారు అని చెబితే నమ్ముతారా? నిజమేనండీ.. ఎప్పుడు తినాలంటే అప్పుడూ చేసుకునే తినేవారంట. ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి. ఇక ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో పండగల సమయంలో తప్పకుండా ఈ పాల పూరీలు చేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఇందులో ఉపయోగించే పాలను ఫ్రిజ్​లో స్టోర్​ చేసుకుంటే ఓ మూడు నాలుగు రోజుల పాటు ఎప్పుడంటే అప్పుడు పూరీలు చేసుకుని ఇందులో కలుపుకుని తినొచ్చు. మరి.. వీటిని ఎలా తయారు చేయాలి? పాల పూరీలు పర్ఫెక్ట్​గా రావాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

పాల పూరీలకు కావాల్సిన పదార్థాలు:

  • గోధుమిపిండి - 1 కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • నెయ్యి - 2 టీ స్పూన్లు
  • చిక్కటి పాలు - 1 లీటర్​
  • గసగసాలు - 2 టేబుల్​ స్పూన్లు
  • బియ్యం పిండి - 2 టీస్పూన్లు
  • జీడిపప్పు పలుకులు - పావు కప్పు
  • పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
  • పంచదార - ముప్పావు కప్పు
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి గోధుమపిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని అందులోకి గసగసాలు, బియ్యప్పిండి వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు వేసి కొంచెం కూడా బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసి వెన్న కన్నా సాఫ్ట్​ ఉండే విధంగా గ్రైండ్​ చేసుకోవాలి. అయితే ఇక్కడా అన్ని ఒకేసారి వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అన్ని ఒకేసారి వేస్తే మెత్తగా గ్రైండ్​ అవ్వదు. అదే ఒక్కొక్కటి వేసుకుంటే చాలా మెత్తగా గ్రైండ్​ అవుతుంది.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి గ్రైండ్​ చేసుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసి.. చిక్కటి పాలు పోసుకుని కలుపుకోవాలి.
  • స్టవ్​ను సిమ్​లో పెట్టి గరిటెతో కలుపుతూ పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇలా కావడానికి సుమారు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది.
  • అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలిపి పంచదార కరిగే వరకు కలుపుతూ మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది మొత్తం రెడీ అయ్యేవరకు పాలు కలుపుతూనే ఉండాలి. లేకుంటే అడుగు మాడిపోతుంది.
  • ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే స్టవ్​ మీద కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఈలోపు ముందే కలిపిన గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇలా చేసుకున్న ఉండలను పొడి పిండి సాయంతో పూరీల్లా వత్తుకోవాలి. ఆపై ఫోర్క్ స్పూన్​ సాయంతో పూరీలపై చిన్నగా ప్రెస్​ చేయాలి. ఇలా చేయడం వల్ల పూరీలు పొంగవు.
  • ఇలా చేసుకున్న పూరీలను కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా అప్పడాల మాదిరి కాల్చుకోవాలి.
  • ఇలా కాల్చుకున్న పూరీలను ముందే ప్రిపేర్​ చేసుకున్న పాల మిశ్రమంలో వేసి ఓ 15 సెకన్లు ఉంచి వెంటనే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుని పక్కక పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాల పూరీలు రెడీ.
  • వీటిని తినాలనుకున్నప్పుడు పాలతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details