తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు - 10 నిమిషాల్లోనే అద్దిరిపోయే "ఉల్లిపాయ పచ్చడి" ఇలా చేసేయండి! - Onion Chutney Recipe - ONION CHUTNEY RECIPE

Onion Chutney Recipe : ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. మార్కెట్​కు వెళ్లిరావాలంటే టైమ్ ఉండదు, లేదంటే ఓపిక ఉండదు. ఇలాంటప్పుడు ఉల్లిగడ్డలతో 10 నిమిషాల్లోనే అద్దిరిపోయే చట్నీ తయారు చేసేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Onion Chutney Recipe
Onion Chutney Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 10:26 AM IST

How to Make Onion Chutney :ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు ఉల్లిపాయలతో అద్దిరిపోయే పచ్చడి చేసుకోవచ్చు. అవునండి.. ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి టేస్ట్​ చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకోవాలని అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ చట్నీ. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే.. దిల్ ఖుష్ అవుతుందంటే నమ్మాల్సిందే. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు.. ఇడ్లీ, దోశ, వడ వంటి ఏ టిఫెన్​లోకైనా కూడా సూపర్​గా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ టేస్టీ అండ్ స్పైసీ​ ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలి? ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ? అనేవి తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవండి.

ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు..

  • ఎండు మిర్చి-6
  • పెద్ద ఉల్లిపాయలు-3
  • ఆవాలు-టీస్పూన్​
  • జీలకర్ర -టీస్పూన్​
  • మినప్పప్పు-స్పూన్​
  • పచ్చిమిర్చి-3
  • చిన్న ఉసిరికాయంత చింతపండు
  • ఉప్పు - రుచికి సరిపడా

తాళింపు కోసం..

  • 2 స్పూన్ల నూనె
  • అర స్పూన్- ఆవాలు
  • చిటికెడు ఇంగువ
  • 2 రెబ్బలు కరివేపాకు

తయారీ విధానం..

  • పచ్చడ తయారీలో భాగంగా.. మొదట ఉల్లిపాయలు, పచ్చిమిర్చీని సన్నగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ మీద పాన్​ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేసి వేడి చేయాలి.
  • ఇప్పుడు పాన్​లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని ఒక నిమిషం సేపు వేపుకోవాలి.
  • తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్​లో ఉల్లిపాయ ముక్కలు వేసి, కొద్దిగా ఆయిల్​ వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత చింతపండు వేసుకుని మరొక నిమిషం వేపుకోవాలి.
  • తర్వాత మిక్సీ జార్​లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఫ్రై చేసుకున్నవి వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • అలాగే ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, రుచికి సరిపడా ఉప్పు​ వేసుకుని మరొకసారి గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు తాళింపు కోసం నూనె వేసుకుని వేడి చేయాలి. ఇందులో ఆవాలు, ఇంగువ, రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి.
  • తాళింపును గ్రైండ్​ చేసుకున్న ఉల్లిపాయ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది.
  • అంతే.. నోరూరించే ఉల్లిపాయ చట్నీ రెడీ.
  • చాలా సింపుల్​గా రెడీ అయ్యే ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు.

ABOUT THE AUTHOR

...view details