Onion Bonda Recipe : చాలా మందికి సాయంత్రం టీ టైమ్‌లో.. సమోసా, మిర్చీ బజ్జీ, ఉల్లి పకోడి ఇలా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంది. కాస్త కారంగా స్నాక్ తిని టీ/కాఫీ తాగితే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. మీరు కూడా ఇలానే ఇంట్లో ఈవెనింగ్ రకరకాల స్నాక్స్ ట్రై చేస్తుంటారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! ఇప్పుడు మనం 10 నిమిషాల్లోనే ఉల్లి బోండాలను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఆనియన్ బోండా చేస్తే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా రుచికరంగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఉల్లి బోండాఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పెరుగు-కప్పు
- గోధుమ పిండి-అర కప్పు
- బియ్యం పిండి-పావుకప్పు
- అరకప్పు- గోధుమ రవ్వ
- ఉప్పు రుచికి సరిపడా
- బంగాళాదుంపలు-2
- పచ్చిమిర్చి-4
- ఉల్లిపాయలు-2
- కరివేపాకు-2
- జీలకర్ర-టీస్పూన్
- కొత్తిమీర-కొద్దిగా
- అల్లం ముక్కలు- 2 చిన్నవి
- వంటసోడా-చిటికెడు
తయారీ విధానం :
- ముందుగా బంగాళదుంపలను నీటిలో శుభ్రం చేసి.. పైన పొట్టు తీసేసుకోవాలి. ఆపై సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి.
- అల్లం, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పెరుగు, బంగాళాదుంప ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఇందులోనే గోధుమ పిండి, బియ్యం పిండి వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. (పిండి అవసరాన్ని బట్టి గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని నీళ్లు పోసుకోవాలి. గోధుమపిండికి బదులుగా మైదా పిండి కూడా ఉపయోగించుకోవచ్చు.)
- ఇప్పుడు మిక్సీలోని పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో గోధుమ రవ్వ వేసి బాగా మిక్స్ చేయండి.
- తర్వాత అల్లం తురుము, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి బాగా కలపండి.
- ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి పిండిని మిక్స్ చేయండి.
- ఆపై ఉల్లి బోండా వేయించడం కోసం.. స్టౌపై కడాయి పెట్టి నూనె పోయండి. నూనె వేడయ్యాక ఎగ్ బోండా చిన్నవిగా వేసుకోండి.
- స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బోండాలను దోరగా వేయించుకోండి.
- అంతే ఇలా ఉల్లి బోండాలు చేసుకుంటే కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈబోండాలుపల్లీ చట్నీ, టమాటా చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయి.
- నచ్చితే ఉల్లి బోండాలను మీరు కూడా ఇలా ట్రై చేయండి.
చల్లటి సాయంత్రం వేళ కమ్మటి "ఎగ్ బోండా"- సింపుల్‌గా ఇంట్లో చేసేయండిలా!!
మైసూర్ బోండాకు హోటల్ రుచి రావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే అమోఘమైన టేస్ట్!